Vastu Plants : ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో సమస్యలు కచ్చితంగా ఉంటాయి. అయితే అందరికీ కామన్‌గా ఉండేది.. డబ్బు సమస్య. కొందరు డబ్బు సంపాదిస్తుంటారు, కానీ వృథాగా ఖర్చు అవుతుంటుంది. ఇక కొందరు ధనాన్ని సంపాదించలేకపోతారు. అయితే అలాంటి వారు ఫెంగ్ షుయ్ వాస్తు ప్రకారం కింద తెలిపిన రెండు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే.. దాంతో ధనం ఆకర్షించబడుతుంది. ఆర్థిక సమస్యలు పోతాయి.
ఇంట్లో కాయిన్ ప్లాంట్‌తోపాటు మనీ ప్లాంట్‌ను కూడా పెంచుకోవాలి. ఈ రెండు మొక్కలు మనకు ఉండే ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీని బయటకు పంపిస్తాయి. పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. దీంతో ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. డబ్బు చేతిలో నిలుస్తుంది. ఆర్థికంగా ఎలాంటి సమస్యలూ ఉండవు.
![Vastu Plants : ఇంట్లో ఈ రెండు మొక్కలను పెంచుకోండి.. ధనం ప్రవాహంలా వస్తుంది.. Vastu Plants keep them in your house for wealth and luck](https://i0.wp.com/telugunews365.com/wp-content/uploads/2022/12/vastu-plants.jpg?resize=1200%2C675&ssl=1)
ఇక ఈ రెండు మొక్కల వల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ మొక్కలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద పెట్టుకోవచ్చు. లేదా ఇంట్లో ఈశాన్యం దిశలో పెట్టుకోవాలి. బిజినెస్ చేసేవారు లేదా షాపులు ఉన్నవారు ప్రధాన ద్వారం వద్ద ఈ మొక్కలను ఉంచాలి. దీంతో వ్యాపారంలో వృద్ది చెందుతారు. అయితే ఎట్టి పరిస్థితిలోనూ ఇంట్లో బెడ్‌రూమ్‌లో ఈ మొక్కలను ఉంచరాదు. పైన చెప్పిన చోట్లలోనే ఈ మొక్కలను ఉంచి పెంచాలి. దీంతో అన్ని సమస్యలూ పోతాయి.