varun Tej-Lavanya Tripathi: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1న జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా పెళ్లి వేడుక సంబరాలు ఇప్పటికే మొదలయ్యాయి. నిశ్చితార్థం వేడుకను పూర్తి చేసుకున్న ఈ మెగా జంట.. ఇప్పుడు ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తో ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల చిరంజీవి ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఆ పార్టీలో చిరంజీవి, రామ్ చరణ్, నాగబాబు, సాయి ధరమ్, వైష్ణవ్ తేజ్ తో పాటు మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా హాజరయ్యారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం హాజరు కాలేదు. అతను రాజకీయాలతో బిజీగా ఉండడం వలన హాజరు కాలేకపోయాడని పెళ్లికి మాత్రం తప్పక హాజరు అవుతాడని తెలుస్తుంది.
అల్లు వారింట్లో జరిగిన వరుణ్ తేజ్ – లావణ్య ప్రీ వెడ్డింగ్ పార్టీకి చిరంజీవి, నాగబాబు, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, అల్లు శిరీష్, అల్లు అరవింద్, ఉపాసన, వైష్ణవ్ తేజ్‌తో పాటు వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా, అల్లు ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేడుకలో ఉన్నారు. హీరో నితిన్, హీరోయిన్ రితూ వర్మ కూడా ఈ పార్టీకి వచ్చారు. ఈ పార్టీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కేక్ కూడా కట్ చేశారు. ఈ ప్రీ-వెడ్డింగ్ పార్టీ ఫొటోలను వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బన్నీ, స్నేహ అక్క థ్యాంక్స్ అని క్యాప్షన్ రాశారు వరుణ్. అల్లు శిరీష్ కూడా కొన్ని ఫోటోలను షేర్ చేశారు. ఈ వేడుకను మెగా, అల్లు కుటుంబాల సభ్యులు చాలా సంతోషంగా జరుపుకున్నారు.
జూన్‌లో వరుణ్, లావణ్యల నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. నవంబర్ 1న ఈ ప్రేమజంట వివాహ బంధంతో ఒక్కటికానుంది. ఇటలీలోని టస్కానీలో వివాహం జరిపించేందుకు మెగా కుటుంబం ఏర్పాట్లు చేస్తోంది.వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి ఇటలీలో జరగనుందని తెలుస్తోంది. నవంబర్లోనే ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుగుతుందని సమాచారం. అయితే, పెళ్లి తేదీపై మెగా కుటుంబం నుంచి ఇప్పటి వరకు అధికారికంగా సమాచారం బయటికి రాలేదు. అయితే, ఇటలీలోనే పెళ్లి ఉంటుందని ఉపాసన ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు