Vangalapudi Anitha : టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత… పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆమె విశాఖ జిల్లా పాయకరావుపేట లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ సమయంలో బీజేపీతో పాటు జనసేన కూడా సపోర్ట్‌గా ఉన్నాయి. కాని ఆ తర్వాత ఐదేళ్ల పాలనలో సొంత పార్టీ నేతలతో పాటు మిత్ర పక్షం కూడా విసిగిపోయాయని అంటున్నారు. దాంతో పొత్తులలో భాగంగా పాయకరావు పేట అనితకి ఇవ్వొద్దని స్వీట్ వార్నింగ్ ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఈ నెల 14న ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.
ఆ సమావేశంలో జనసేనకి చెందిన సీనియర్ లీడర్ గెడ్డం బుజ్జి మాట్లాడుతూ.. అనితకి టిక్కెట్ ఇవ్వొద్దని టీడీపీ అధినాయకత్వానికి హెచ్చరిక పంపారు. 2014లో ఆమె తనపై రేప్ కేసు పెట్టించిందని, అప్పుడు గంటా శ్రీనివాసరావు వలన దాని నుండి బయటపడ్డానని లేకపోతే ఈ రోజు నా పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. అనితకి టిక్కెట్ ఇస్తే మాత్రం ఓటమి తప్పదంటూ వార్నింగ్ ఇస్తున్నారు. అనితకి తప్ప ఎవరికి టిక్కెట్ ఇచ్చిన ఓకే అని గెడ్డం బుజ్జి అంటున్నారు. పేట టిక్కెట్ జనసేనకి ఇవ్వొచ్చు కదా అని ఆయన అన్నారు.
![Vangalapudi Anitha : రోజు రోజుకీ దారుణంగా మారుతున్న అనిత పరిస్థితి.. ఇలా అయిందేంటి..? Vangalapudi Anitha facing problems in her constituency](http://3.0.182.119/wp-content/uploads/2023/06/vangalapudi-anitha.jpg)
మరోవైపు పాయకరావుపేటలో అనిత మీద సొంత సామాజిక వర్గం గుర్రుమీదుంది. ఆమె ఉండేది విశాఖలో. పాయకరావుపేటకి అలా వలసనేతగా వచ్చి వెళుతుందని కొందరు తిట్టి పోస్తున్నారు. ఆమె పార్టీలో ఒక వర్గాన్ని చేరదీస్తూ పార్టీలో చీలికలు ఏర్పడడానికి కారణమవుతున్నారని కొందరు చెప్పుకొస్తున్నారు. పాయకరావుపేటలో కాపు వర్గానికి ఎక్కువ క్రేజ్ ఉంది. వారితో మంచిగా ఉంటేనే ఎవరైన గెలిచేది. అలాంటిది అనిత వారితోనే సున్నం పెట్టుకుందని ఈ సారి కూడా ఆమె గెలవడం కష్టమే అని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి రానున్న రోజులలో పాయకరావు పేట రాజకీయం ఎలా మారబోతుంది అనేది.