Vangalapudi Anitha : టీడీపీ మహానాడు కార్యక్రమంలో తెలుగు దేశం నేతలు వైసీపీ నేతలపై విరుచుకు పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే టీడీపీ తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వంగలపూడి అనిత సమయం వచ్చినప్పుడల్లా వైసీపిీ నాయకులపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా రోజా, కొడాలి నానిపై ఆమె చేసే కామెంట్స్ హాట్ టాపిక్ అవుతుంటాయి. అబద్దపు హామీలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోసం చేశారని ఓ సారి అనిత విమర్శించింది. సీఎం జగన్ జగనన్న స్టిక్కర్ల పథకానికి శ్రీకారం చుట్టారు. జైలులో 13 నెలలు ఉండి బయటకు వచ్చిన వ్యక్తి రాష్ట్రానికి భవిష్యత్తా? ఈసారి నుంచి మాట తప్పదు మడమ తిప్పడు అన్న వైసీపీ నాయకుల నాలుకను ప్రజలు కొయ్యాలి అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.
ఇక రోజాపై విరుచుకుపడింది. లోకేష్‌పై విమర్శలు చేసిన క్రమంలో రోజా నోరు అదుపులో పెట్టుకోకుంటే, ఏదో ఒకరోజు తెలుగు మహిళలు, తెలుగు తమ్ముళ్ల చేతిలో చావుదెబ్బలు తినడం ఖాయం అని హెచ్చరించారు. రాష్ట్రంలో జరిగే నేరాలు, ఘోరాలన్నింటికీ ఐరన్ లెగ్ రోజా, మహా ఐరన్ లెగ్ జగనే కారణమని వ్యాఖ్యానించారు. ఇక తాజాగా మహానాడులో అనిత మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్‌లపై ప్రశంసలు కురిపించింది. నారా లోకేష్ ప్రజల కోసం జనాలలోకి వచ్చి ఎంతో కష్టపడుతున్నారు. ఆయన రానున్న రోజులలో ప్రజలని అభివృద్ధిలోకి తీసుకెళతాడని ప్రశంసించింది.
![Vangalapudi Anitha : గుట్కా తినే వాడు కూడా మాట్లాడుతున్నాడు అంటూ నానికి అనిత స్ట్రాంగ్ వార్నింగ్ Vangalapudi Anitha comments on kodali nani](http://3.0.182.119/wp-content/uploads/2023/05/vangalapudi-anitha.jpg)
ఇక నందమూరి తారకరామారావు గురించి కూడా ప్రశంసలు కురిపించిన అనిత.. కొడాలి నానిపై దారుణమైన కామెంట్స్ చేసింది. చెత్త అంతా ఒక చోట చేరిందని కామెంట్‌కి అనిత మాట్లాడుతూ.. జగన్ ప్రభుత్వంలోనే చెత్త ఎక్కువగా ఉందని, గుట్కా నములుకుంటూ ప్రెస్ ముందుకు వచ్చే రాస్కెల్ కూడా తెలుగు దేశం గురించి మాట్లాడుతున్నాడని ఆమె పంచ్‌లు వేసింది. ఈ ఎలక్షన్స్ మన భవిష్యత్కి ముఖ్యం. అందుకే ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని ఆమె పేర్కొంది.