Vanga Geetha : ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై వంగా గీత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. ఆయ‌న‌వి దింపుడు క‌ళ్లెం ఆశ‌లు అంటూ ఫైర్..

Vanga Geetha : ఎన్నికల వేళ పిఠాపురం రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం పిఠాపురం కావటంతో వైసీపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. తాను పిఠాపురం నుంచి గెలవటం ఖాయం అని ధీమా వ్యక్తం చేసారు. వంగా గీత గతంలో పీఆర్పీ నుంచి గెలిచారని..గీత కూడా జనసేనలోకి రావాలని ఆహ్వానించారు. ఈ ఎన్నికలు అయిపోయాక వంగా గీత జనసేన పార్టీలోకి వస్తారని వ్యాఖ్యానించారు. ఆమెను రాజకీయాల్లోకి తీసుకువచ్చిందే తామని అన్నారు. పిఠాపురంలో తన ఓటమి కోసం మంత్రి పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డిని రంగంలో దించారని, ఓటుకు రూ.10 వేలు, కుటుంబానికి లక్ష ఇస్తున్నట్టు తెలుస్తోందని వివరించారు. ఎవరెన్ని చేసినా పిఠాపురంలో తన గెలుపును అడ్డుకోలేరని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

ఈ వ్యాఖ్యలపై ఎంపీ వంగా గీత స్పందించారు.ప‌వ‌న్ చెబుతున్నట్టు నేను రాజకీయాల్లోకి వచ్చింది 2009లో కాదని, తాను డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నప్పటి నుంచే రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. విద్యార్థి రాజకీయ నేతగా ప్రస్థానం ప్రారంభించానని, స్కూలు స్థాయి నుంచే తనకు సేవ అంటే ఇష్టమని, ప్రజల్లో ఉండడం అంటే ఇష్టమని చెప్పారు. స్కూల్లో కూడా చీపురు పట్టుకుని ఊడ్చేదాన్నని వంగా గీత వెల్లడించారు. ఎన్ఎస్ఎస్ లో బెస్ట్ వర్కర్ ని అని, ఎన్సీసీలో బెస్ట్ కేడెట్ ని అని వివరించారు. పవన్ కాపు అయితే తాను కూడా కాపు ఆడపడుచునే అని అన్నారు.

Vanga Geetha sensational comments on pawan kalyan
Vanga Geetha

కుల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదు.ప్రతి వర్గాన్ని అభివృద్ధి చేయాలనేది లెక్కగా ఉండాలి. కాపులంతా 100% నాకు సహకారం అందిస్తారు.నియోజకవర్గంలో అన్ని వర్గాల నుంచి కూడా నాకు మద్దతు లభిస్తుంది అని వంగా గీత స్పష్టం చేశారు. మనిషికి లక్ష ఇస్తున్నారంటూ నిన్న మీటింగ్ లో మాట్లాడారు… ఇప్పటి నుంచే ఎందుకు దింపుడు కళ్లం ఆశలు! పోలింగ్ కు ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈ లోపున చక్కగా ప్రచారం చేసుకోవచ్చు… ఇప్పుడే డబ్బుల గొడవ ఎందుకు? ప్రజలేంటి, వాళ్ల పరిస్థితులేంటి, వాళ్ల ఇబ్బందులేంటి… నియోజకవర్గానికి చేయాల్సిందేమిటి? ఇవి కదా ఆలోచించాలి అని వంగా గీత స్పష్టం చేశారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago