Vallabhaneni Vamshi : ప్రస్తుతం ఏపీలో రాజకీయం చాలా హోరాహోరీగా సాగుతుంది. చంద్రబాబు, లోకేష్‌లు వైసీపీపై దారుణమైన కామెంట్స్ చేయగా, దానికి వైసీపీ నాయకులు గట్టిగా ఇచ్చేస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీ ఫ్రేములోకి వచ్చి చంద్రబాబు, లోకేష్‌పై పంచ్ ల వర్షం కురిపించారు. చంద్రబాబు నాయుడు ఫొటో పెట్టుకొని మీరు గెలిచారంట అని అంటున్నారు అని ప్రశ్నించగా, దానికి స్పందించిన వంశీ… చంద్రబాబు తన కొడుకుని ఎందుకు గెలిపించలేకపోయాడు. మిగతా వాళ్లు ఎందుకు గెలవలేకపోయారిన ప్రశ్నించాడు. ఇక ఆడవాళ్లని అడ్డం పెట్టుకొని బ్రతకడం చంద్రబాబు, లోకేష్‌కి అలవాటు. వాళ్లింట్లో వాళ్లే ఆడవాళ్లా, మిగతావారు కాదా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబుని ఇప్పటికీ ఎన్టీఆర్ రామారావు అల్లుడు అంటారు. ఎన్టీఆర్ కూతురి భర్తగా ఆయనకి పేరు వచ్చింది. లోకేష్‌ని బాలయ్య అల్లుడు అనో లేదంటే ఎన్టీఆర్ రామారావు మనవడో అంటారు. ఎన్టీఆర్ కూతురి బిడ్డ అంటారు. చంద్రబాబు, లోకేష్‌లకి ఆడవాళ్లని అడ్డం పెట్టుకోవడం అలవాటు. చంద్రబాబు నాయుడు డీఎన్ఏ శ్రీకృష్ణదేవరాయలుది అని చెబుతున్నారు. అదేంటో నాకు అర్ధంకాలేదు అని వరుస పంచ్‌లు వేసారు వల్లభనేని. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ గా యార్లగడ్డ నియామకంతో కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. ఈ సమయంలో వైసీపీ అలర్ట్ అవుతోంది.
![Vallabhaneni Vamshi : నీ ఫొటో పెట్టుకొని నీ కొడుకు పప్పు గెలవలేకపోయాడు.. చంద్రబాబుపై వంశీ పంచ్‌లు.. Vallabhaneni Vamshi strong counter to lokesh](http://3.0.182.119/wp-content/uploads/2023/08/vallabhaneni-vamsi.jpg)
టీడీపీ నుంచి వైసీపీకి వచ్చిన వంశీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ మొదలు పెట్టింది.ఉమ్మడి జిల్లాలోని గుడివాడ, గన్నవరంలో కొడాలి నాని…వల్లభనేని వంశీ పైన టీడీపీ ప్రత్యేకంగా గురి పెట్టింది. జిల్లాలో లోకేష్ పాదయాత్ర వేళ ప్రత్యేకంగా గన్నవరం పైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్లు స్పష్టం అయింది. జిల్లాలో టీడీపీ నేతల మధ్య ఆధిపత్య పోరుతో లోకేష్ యాత్ర విజయవాడ నగరంతో పాటుగా పెనమూలూరు, గన్నవరం లో ముగించి నూజివీడులో కొనసాగుతోంది. ఎంపీ కేశినేని నాని యాత్రకు దూరంగా ఉన్నారు.