ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ, గన్నవరం రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. లోకేష్ సభ, గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్‌గా యార్లగడ్డ వెంకట్రావు నియామకంతో కొత్త లెక్కలు తెరమీదకు వస్తున్నాయి. దాంతో వైసీపీ అలర్ట్ అయ్యింది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన వల్లభనేని వంశీకి ఎన్నికల్లో గెలుపు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. యార్లగడ్డకు బాధ్యతలు ఇవ్వటం ద్వారా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేయగా, తాజా పరిణమాలతో వైసీపీ కొత్త గేమ్ స్టార్ట్ చేసింది. గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు టీడీపీలో చేరటంతో, మరో నేత దుట్టా రామచంద్రరావుతో వైసీపీ ఎంపీ బాలశౌరి మంతనాలు జరిపారు. హనుమాన్ జంక్షన్‌లోని దుట్టా ఇంటికి వెళ్లిన ఆయన.. పార్టీలోనే కొనసాగేలా చర్చలు జరిపినట్లు వార్తలు వచ్చాయి.
కట్ చేస్తే పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, జగన్ మోహన్ రెడ్డికి అలాగే వైసీపీకి దూరంగా జరుగుతున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తునాయి. జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు బాలశౌరి, ఇద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో కూడా వల్లభనేని బాలశౌరి వైసీపీ ఎంపీగా మచిలీపట్నం నుంచి బరిలోకి దిగటం దాదాపు ఖాయమనే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో గత నాలుగు ఐదు రోజుల నుంచి వల్లభనేని బాలశౌరి వైసీపీ పట్ల కొంత విముఖత వ్యక్తపరుస్తున్నట్లుగా కనిపిస్తుంది.
విశ్వసనీయ వర్గాలనుంచి అందుతున్న సమాచారం ప్రకారం, వల్లభనేని బాలశౌరి వైసీపీని వీడే పరిస్థితి కనిపిస్తుంది, అదే నిజమైతే బాలశౌరి, జనసేన తరుపునుంచి మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తునాయి.ఇది అయితే వైసీపీకి మాత్రం పెద్ద షాక్ గా చెప్పవచ్చు బాలశౌరి వీడటం అనేది చాలా షాక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు పార్టీని వీడటం అనేది ఒక కొత్త పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది.