Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది జూన్‌లో అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే. దాదాపు 11ఏళ్ల తర్వాత ఉపాసన, రామ్ చరణ్ లు తల్లిదండ్రులు కావడంతో ఈ విషయం దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది. నేషనల్ మీడియా కూడా వారు తల్లిదండ్రులు అయిన విషయాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఇక చిన్నారి రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా మనవరాలి రాకతో చిరంజీవి- సురేఖ సంబరాల్లో మునిగిపోయారు అభిమానులు కూడా మెగా ప్రిన్సెస్ రాకను ఓ పండగలా సెలబ్రేట్ చేసుకున్నారు. అనంతరం వేడుకగా బారసాల జరిపి మెగా ప్రిన్సెస్‌కు క్లింకార కొణిదెల అని నామకరణం చేశారు రామ్ చరణ్- దంపతులు.
చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్ ప్రిన్స్ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు. మరోవైపు క్లింకారను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రామ్ చరణ్ దంపతులు మాత్రం తమ కూతురు ప్రైవసీ విషయంలో దృఢ నిశ్చయంతో ఉంటూ ఫొటోలు బయటకు రానివ్వడం లేదంటూ తెలుస్తోంది. రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వివాహం కోసం ఇటలీ వెళ్లిన మెగా ఫ్యామిలీ పలు ప్రాంతాలలో ఫొటోలు దిగారు. ఈ పిక్స్‌ని ఉపాసన తమ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అందులో క్లింకార ఫేస్ పై లవ్ సింబల్ ఉంచింది ఉపాసన. అయితే నీటిలో మాత్రం చిన్నారి ప్రతిబింబం కనిపించడంతో క్లింకారని చూసి ఫుల్ ఖుష్ అయ్యారు. ఇక ఇప్పుడు వరుణ్ లావణ్యల కాక్టెయిల్ పార్టీలో ఉపాసన చిన్నారిని ఎత్తుకొని పుల ఫొటోలు దిగిందని, అవే ఈ పొటోలు అంటూ కొన్నింటిని వైరల్ చేస్తున్నారు. ఉపాసన చేతిలో ఉన్న పాప క్లింకార అని కొందరు చెబుతుండగా, మరి కొందరు కాదని చెబుతున్నారు. మొత్తానికి క్లింకారతో ఉపాసన దిగిన ఫొటోలు ఇవే అంటూ పలు ఫొటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఇక మెగా బ్రదర్ నాగబాబు – పద్మజ తనయుడు.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, దేవరాజ్- కిరణ్ త్రిపాఠిల కూతురు లావణ్య త్రిపాఠి పెళ్లి నవంబర్ 1న అత్యంత ఘనంగా జరిగింది. ఇటలీలోని అత్యంత పూరాతన గ్రామం అయిన టుస్కానీలోని బోర్గో శాన్ ఫెలిస్ రిసార్ట్‌లో ఈ వేడుకలు అత్యద్భుతంగా జరిగాయి.