Upasana : రామ్ చరణ్ సతీమణి ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. పాప పుట్టినప్పటి నుండి పాప ఆలనా పాలనా చూసుకుంటూ చాలా ఆనందకరమైన జీవితం గడుపుతుంది ఉపాసన. తాజాగా తన మంచి మనసును చాటుకుంటూ సింగిల్ మదర్స్ కోసం స్ట్రాంగ్ డిసిషన్ తీసుకుంది ఉపాసన. ఇకపై అపోలో చిల్డ్రన్స్ హాస్పటిల్‌లో వారాంతాల్లో సింగిల్ మదర్ చిల్డ్రన్స్‌కు ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ అందిస్తామని చెప్పింది. నేను ప్రెగ్నెంట్ అయిన నుంచి బిడ్డకు జన్మనిచ్చేంతవరకు నా జర్నీలో ప్రోత్సాహం అందించినవారికి ధన్యవాదాలు. అపోలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని లాంచ్ చేయడం సంతోషంగా ఉందని అన్నారు.
పిల్లలు అనారోగ్యానికి గురైనప్పుడు తల్లిదండ్రులు ఎంతగా తల్లడిల్లిపోతారు.. పిల్లలను సంపూర్ణ ఆరోగ్యంతో పేరెంట్స్ వద్దకు చేర్చడం మా బాధ్యత. వారి ముఖాల్లో చిరునవ్వులకు కారణమవుతున్న వైద్యులకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మాతృత్వాన్ని ఆస్వాదిస్తున్నాను. గతంలో ఇతర తల్లుల ముఖాల్లో ఆ ఆనందాన్ని చూసేదాన్ని . పిల్లలకు అనారోగ్యానికి గురయితే ఆ తల్లిదండ్రులు ఎంతగా అల్లాడిపోతారో నాకు తెలుస్తోంది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంతమంది తల్లులు ఇబ్బందిపడడం నేను చూశాను. కొందరు మహిళలు నా దగ్గరకి వచ్చి బాధ చెప్పుకోగా, అది విని చాలా బాధపడ్డాను.
నన్ను ఆశ్రయించిన వారిలో సింగిల్స్ మదర్స్ ఉన్నారు. వాళ్లకు నా సపోర్ట్ చాలా అవసరం. అందుకే మేము ఓ ప్రకటన చేస్తున్నాము. వారాంతాల్లో సింగిల్ మదర్స్ తమ పిల్లలను అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్ కు తీసుకువచ్చి ఉచితంగా వైద్యం పొందవచ్చు. దీనివల్ల వారికి మేలు లాభం చేకూరుతుందని అనుకుంటున్నాను. వాళ్లను ప్రోత్సాహం ఇస్తాను. ఇది ఎమోషనల్ జర్నీ ” అంటూ చెప్పుకొచ్చారు. సీఎస్ఆర్- అపోలో వైస్ చైర్‌పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఉపాసన.. సింగిల్ మదర్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. గర్భంతో ఉన్న సమయం నుంచి డెలివరీ వరకు సాగిన జర్నీ మరచిపోలేనిదని.. ఈ జర్నీలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని ఉపాసన చెప్పింది. ఇప్పుడు అపోలో చిల్డ్రన్స్ హాస్పిటల్స్‌ను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉందని, ఇది తనకు చాలా ఎమోషనల్ జర్నీ అని పేర్కొంది.