Upasana : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఆయన సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. క్లీంకార పుట్టుకతో వారు తల్లిదండ్రులుగా జీవితంలో కొత్త అంకాన్ని ప్రారంభించారు. జూలై 20న క్లింకార ఆగమననానికి నెల రోజులు కావడంతో రామ్ చరణ్ ఒక అందమైన వీడియో విడుదల చేశారు. ఇందులో కుటుంబ సభ్యులు అందరు సంతోషంగా కనిపించారు. రామ్ చరణ్ మాట్లాడుతూ.. క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టింది.. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం అని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.
ఇప్పుడు రామ్ చరణ్ ఆనందభరితమైన క్షణాలు గడుపుతున్నారు. ఉపాసన ప్రగ్నెంట్ అయినప్పటి నుండి ఆమెకి తోడుగా ఉంటూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చాడు. షూటింగ్స్ కూడా మానేశాడు. అయితే క్లింకార పుట్టిన తర్వాత మళ్లీ రామ్ చరణ్ షూటింగ్స్ కి వెళుతున్నాడని, పాపని వదిలి వెళ్ళలేకపోతున్నాడంటూ ఉపాసన ఓ కార్యక్రమంలో తెలియజేసింది. ఇది విని కూతురిపై రామ్ చరణ్‌కి ఎంత ప్రేమ ఉందో అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొంది పాపాకి క్లింకార అనే పేరు పెట్టిన విషయం తెలిసిందే.
పాప పుట్టాక రామ్ చరణ్ దంపతులు చిరంజీవి ఇంటికి షిఫ్ట్ అయ్యారు. తమ చిన్నారి కోసం చరణ్-ఉప్సీ ప్రత్యేక గదిని సిద్ధం చేశారు. తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో గదిని సిద్ధం చేశారు. ఈ గదిని ఫారెస్ట్ థీమ్ తో రూపొందించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉప్సీ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కూతురిని మాత్రం ఉపాసన రామ్ చరణ్‌లు కంటికి రెప్పలా చూసుకుంటున్నారు.