Upasana : టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఉపాసన రామ్ చరణ్ జంట ఒకటి. పదకొండేళ్ల వివాహం తర్వాత ఈ జంట జూన్ 20న పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఇక జూన్ 23న హైదరాబాద్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఉపాసన డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్బంగా రామ్ చరణ్, ఉపాసన దంపతులు తమకు పుట్టిన బిడ్డను మీడియాకు చూపించారు. కూతురిని చేతులో ఎత్తుకొని భార్య ఉపాసనతో కలిసి చరణ్ హాస్పిటల్ బయటకు వచ్చారు. వారి వెంట రామ్‌చరణ్ తల్లి సురేఖతో పాటు అత్తయ్య శోభన కామినేని కనిపించారు.
రామ్‌చరణ్, ఉపాసన దంపతులు హాస్పిటల్ నుంచి బయటకు వస్తోన్న వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. ఇక తన చేతిలో బిడ్డను ఇచ్చి ఉపాసనని పంపిపించిన చరణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఈ రోజే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళుతోన్నట్లు చరణ్ పేర్కొన్నాడు. డాక్టర్లు తీసుకున్న కేర్‌తో పాటు అభిమానుల ప్రార్ధనల వల్ల ఉపాసనతో పాటు కూతురు క్షేమంగా ఉన్నట్లు రామ్‌చరణ్ చెప్పుకొచ్చారు. . కూతురికి ఏం పేరు పెట్టబోతున్నారని అడిగిన ప్రశ్నకు తాను ఉపాసన కలిసి ఓ పేరును ఆల్రెడీ డిసైడ్ చేశామని, 21వ రోజు కూతురి పేరును తానే స్వయంగా అందరికి చెబుతానని రామ్‌చరణ్ పేర్కొన్నాడు. డాక్లరతో పాటు ప్రతి ఒక్కరికి కూడా చరణ్ థాంక్స్ చెప్పాడు.
ఇక ఇంటికి వెళ్లిన తర్వాత ఉపాసన తన సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తాను బుల్లి చరణ్ పుడతాడని బావించినట్టు ఉపాసన పేర్కొంది. అయితే తనకు బుల్లి అత్తమ్మ పుట్టడం పట్ల కూడా సంతోషం వ్యక్తం చేసింది. ఇక ఇప్పటికే చరణ్ తాను ఒక పేరు ఫిక్స్ అయినట్టు చెప్పిన ఉపాసన 21వ రోజు రివీల్ చేస్తామని తెలియజేసింది. అయితే రామ్ చరణ్, ఉపాసన దంపతుల పుట్టిన పాపకు తాతయ్య మెగాస్టార్ చిరంజీవి పోలికలు ఉన్నట్టు చూసినవాళ్లు చెబుతున్నారు.మెగా ప్రిన్సెస్ రాకతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబారాన్ని అంటాయి. త్వరలో మెగా ప్రినెన్స్ పుట్టిన సందర్భంగా ఓ భారీ పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తుంది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…