టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్స్‌లో రామ్ చరణ్, ఉపాసన జంట ఒకటి. వీరిద్దరి పెళ్లి అయి పదేళ్లు అయిన కూడా ఇంకా వీరికి పిల్లలు పుట్టలేదు. కొన్నాళ్లుగా ఈ ఇద్దరు ఎక్కడికి వెళ్లిన పిల్లల గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. ఎట్టకేలకు ఈ జంట రీసెంట్‌గా గుడ్ న్యూస్ చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా గతేడాది అభిమానులతో పంచుకుంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా, ఉపాసన తనకు పుట్టబోయే బిడ్డ గురించి మొదటి సారి భావోద్వేగానికి గురయ్యారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకోగా, ఈ కార్యక్రమానికి చరణ్‌తో కలిసి హాజరైన ఉపాసన.. ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ఈ అవార్డు దక్కించుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా పుట్టబోయే బిడ్డ గురించి తొలిసారి రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అయింది. కాలిఫోర్నియాలో జరుగుతున్న గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకలో తన భర్త రామ్ చరణ్ తో కలిసి పాల్గొన్న ఉపాసన ట్రిపుల్ ఆర్ సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పింది. అనంతరం పుట్టబోయే బిడ్డ గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ టీమ్ లో తాను కూడా భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉందని ఉపాసన చెప్పింది. దేశం గర్వించదగిన సమయం ఇది అని పేర్కొంటూ.. ఈ వేడుకల్లో తనతో పాటు తన కడుపులో ఉన్న బిడ్డ కూడా అనుభూతి పొందుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ క్షణాలు ఎంతో భావోద్వేగంగా ఉన్నాయని ఉపాసన తన ట్వీట్‌లో పేర్కొంది.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చరిత్ర సృష్టించింది అని చెప్పాలి.. ప్రపంచ చలన చిత్ర రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ఈ సినిమా దక్కించుకుంది. సినిమాలోని ‘నాటునాటు’ పాట.. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఉత్తమ పాటగా ఎంపికైంది. అమెరికాలో బుధవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొన్నారు. అతిరథ మహారథుల మధ్య ఈ అవార్డును సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు.