Upasana Delivery : గత పదకొండేళ్లుగా రామ్ చరణ్, ఉపాసనల బిడ్డ కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు. ఎట్టకేలకు జూన్ 20న ఉపాసన పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఇక జూన్ 30న క్లింకార అని నామకరణం చేశారు. అయితే మెగా ప్రిన్సెస్ పుట్టి జూలై 20కి నెలరోజులు పూర్తవుతోంది. పైగా అదే ఉపాసన పుట్టిన రోజు కావడం విశేషం. యాదృచ్చికంగా కూతురి వన్ మంత్ బర్త్ డే,శ్రీమతి బర్త్ డే ఒకే రోజు రావడం విశేషం. అయితే రామ్ చరణ్ క్లింకార ఆగమనంకి సంబంధించి రామ్ చరణ్ ఎమోషనల్ వీడియో షేర్ చేశాడు. ఈ వీడియోని టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.
ఇందులో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని చాలా ఎమోషనల్‌గా సంతోషంగా కనిపించారు. క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది అని రామ్ చరణ్ అన్నారు. క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో చూపించారు.

మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవి ఎంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి.మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తానుఅని ఉపాసన చెప్పుకొచ్చింది. క్లింకార పుట్టిన సమయంలో అందరు సంతోషంతో స్వీట్స్ తినిపించుకొని ఆనందం పంచుకున్నారు.