Klinkara : కూతూరి కోసం స్పెష‌ల్ బెడ్ రూమ్ త‌యారు చేయించిన ఉప‌సాన‌.. చూస్తే మ‌తిపోద్ది..!

Klinkara : దాదాపు 11 ఏళ్ల త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు త‌ల్లిదండ్రుల ప్ర‌మోష‌న్ అందుకున్న విష‌యం తెలిసిందే. జూన్ 20న ఉపాస‌న పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌గా, జూన్ 30న బార‌సాల వేడుక నిర్వ‌హించారు. ఈ వేడుకలో తమ మ‌న‌వ‌రాలికి క్లింకారా అనే పేరు పెట్టిన‌ట్టు చిరంజీవి తన సోష‌ల్ మీడియా ద్వారా తెలియ‌జేశారు. ఈ పేరు ఉపాస‌న‌కి పెట్టాల‌ని ఆమె త‌ల్లి అనుకోగా అది కుద‌ర‌లేదు. మ‌న‌వ‌రాలికి పెట్ట‌డంతో శోభ‌న చాలా ఖుషీ అయింది. ఇక త‌మ కుమార్తె ఆల‌నాపాల‌న‌లో ఏ మాత్రం లోటు లేకుండా చూసుకుంటున్నారు మెగా దంప‌తులు.

తమ కుమార్తె అత్యుత్తమంగా మంచి వాతావరణంలో పెరిగేలా ఉపాసన, చరణ్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న నేప‌థ్యంలో ఒక ప్రత్యేక గదిని బెస్ట్ ఇంటీరియర్ డిజైన్ తో రెడీ చేశారు. చిన్నారి పెరిగేందుకు మంచి వాతావరణం ఉండేలా.. పిల్లలు కోరుకునే బొమ్మలు ఉండేలా ఈ గదిని డిజైన్ చేశారు. ఈ వీడియో ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ గా మారింది. పవిత్ర రాజారామ్ అనే ఆర్కిటెక్ట్ తో ఉపాసన ఈ డిజైన్ రెడీ చేశారు. ఉపాసన ఆమెకి తమ పాప కోసం ఫారెస్ట్ థీమ్ లో ఉండే డిజైన్ కావాలని కోరారట. పిల్లలు కోరుకునే విధంగా ఫారెస్ట్ లోనే వివిధ జంతువుల బొమ్మలు, చెట్లు ఉండే బోర్డులు, సాఫ్ట్ గా వైట్ థీమ్ లో ఉండే సోఫాలు మ్యాట్ లు, టేబుల్స్ ఇలా ఆహ్లాద భరితంగా గదిని డిజైన్ చేయించారు.

upasana daughter Klinkara special bedroom
Klinkara

ఇక పాప రూమ్‌లో ఉండే క‌ప్‌బోర్డ్స్ లో వివిధ జంతువుల బొమ్మలు ఉండేలా తీర్చి దిద్దారు. రూమ్ చాలా ప్ల‌జెంట్‌గా ఉండేలా తీర్చిదిద్ద‌గా ఇప్పుడు ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్క‌రి దృష్టిని ఆక‌ర్షిస్తుంది. అయితే బేబీ పెరిగే కొద్దీ అల్లరి చేస్తే రూమ్ మొత్తం ధ్వంసం అవుతుంది.. చిందర వందరగా మారుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.ఇక ఇన్నాళ్లు త‌న భార్య‌తోనే ఉన్న రామ్ చ‌రణ్ ఇక త‌న త‌దుప‌రి సినిమాలు శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ప‌డ్డాడు. గేమ్ చేంజ‌ర్ చిత్రం శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతుండ‌గా, ఈ సినిమా పూర్తైన త‌ర్వాత బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago