TV5 Murthy : ఇటీవల నెట్టింట హాట్ టాపిక్‌గా మారిన అంశంలో మూర్తి వేణు స్వామి ఇష్యూ ఒకటి. వీరిద్దరి వివాదం గురించి మాట్లాడుకుంటున్నారు.ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చించుకుంటున్నారు. టీవీ5 మూర్తి ఇంకా కొందరు జర్నలిస్ట్ లు కలిసి తమను రూ.5 కోట్లు డిమాండ్ చేస్తున్నారంటూ సెలబ్రెటీ అస్ట్రాలజర్ వేణు స్వామి, ఆయన భార్య వీణలు సోషల్ మీడియా ద్వారా వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే.వైరల్ అయిన ఆ వీడియోలో టీవీ 5 మూర్తి ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, అంత డబ్బు మా దగ్గర ఎందుకు ఉంటుందని వాళ్లు చేసే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
.వారు చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అంటూ టీవీ లైవ్ షోలో ప్రకటించాడు మూర్తి. అంతే కాకుండా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి వేణు స్వామి, వీణలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని కేసు ఫిర్యాదు చేశారు.తాను చేయని నేరాన్ని తనపై ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. తన నిజాయితీని కించపరచడంతో పాటు చిత్తశుద్దిని ప్రశ్నించే విధంగా వారు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో తాను ఆయన వికృత చేష్టలు, అబద్దపు జోతిష్యాల గురించి బయట పెట్టడం వల్లే ఇప్పుడు తన గురించి ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నాడు అంటూ మూర్తి చెప్పుకొచ్చాడు.
అయితే అసలు ముందు వేణు స్వామి ఇష్యూని వెలుగులోకి తీసుకొచ్చిన మూర్తి ఆయన చేసే యోని పూజలు, మిగతా పూజలు ఒక్కొక్కటిగా బయటకి తీసి ఫుల్ క్లాస్ పీకారు. మధ్యలో చాగంటి గారి ప్రవచనాలని కూడా ప్లే చేసి వేణు స్వామికి దిమ్మతిరిగే పంచ్‌లు ఇచ్చారు. అసలు ఆయన మంచి వాడు అయినట్టు సెలబ్రిటీల గురించి తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడని మూర్తి దారుణమైన విమర్శలు చేశాడు. ప్రస్తుతం వేణు స్వామి సైలెంట్‌గా ఉన్నా రానున్న రోజులలో ఎలాంటి స్టెప్పులు వేస్తాడా అని అందరు ముచ్చటించుకుంటున్నారు.