ద‌ర్శ‌కుడు త్రివిక్రమ్ భార్య‌ సౌజన్య ఏం చేస్తుందో తెలుసా..?

టాలీవుడ్ దర్శకులు ఎందరో ఉన్నారు, కానీ త్రివిక్రమ్ రూటే సపరేటు అని చెప్పవచ్చు. రచయితగా, దర్శకుడిగా త్రివిక్రమ్ మాటలతో ప్రేక్షకులను మాయ చేస్తూ ఉంటాడు. అందుకే త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అయ్యాడు. తన సినిమాలతో అన్ని వర్గాల వారిని అలరిస్తూ టాప్  దర్శకుల లిస్టులో చేరిపోయారు. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన  అత‌డు, జులాయి అత్తారింటికి దారేది, అలావైకుంఠ‌పురంలో సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్ లుగా నిలిచాయి. ప్రస్తుతం త్రివిక్ర‌మ్ మ‌హేష్ బాబుతో భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తున్నాడు.

ఇక అలా వైకుంఠ‌పురంలో సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఓ ఆస‌క్తిక‌ర‌మైన సంఘ‌ట‌న జ‌రిగింద‌ని త్రివిక్ర‌మ్ ఆ సినిమా ఆడియో ఫంక్ష‌న్ లో చెప్పారు. త‌న భార్యను సాధార‌ణంగా ఎప్పుడూ షూటింగ్ ల‌కు తీసుకువెళ్ల‌లేద‌ని చెప్పారు. కానీ అలా వైకుంఠ‌పురంలో సినిమాలోని సామ‌జ‌వ‌ర‌గ‌న‌మ‌న పాట షూటింగ్ కోసం పారిస్ వెళ్లామ‌ని, అప్పుడు త‌న భార్యను కూడా వెంట తీసుకువెళ్లాన‌ని త్రివిక్ర‌మ్ తెలిపారు. కానీ రెండు రోజుల‌కే త‌న భార్య నీర‌సించిపోయింద‌ని అక్క‌డ ఉండ‌లేక నన్ను వ‌దిలేసి ఇంటికి వ‌చ్చేసిందని చెప్పారు.

trivikram wife soujanya do you know what she does

ఇలా త్రివిక్రమ్  కెరీర్ గురించి.. సినిమాల గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర్లేదు. కానీ త్రివిక్రమ్ వ్యక్తిగత జీవితం గురించి  చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ముఖ్యంగా త్రివిక్రమ్ సతీమణి   గురించి కానీ.. ఆవిడ గురించి నిజాలు చాలా తక్కువ మంది తెలుసుకుని ఉంటారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సతీమణి పేరు సౌజన్య. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సౌజ‌న్య‌ను 2002లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు సంతానం ఉన్నారు.  ఈమె ఇంకెవరో కాదు.. స్వయానా పాటల రచయిత ప‌ద్మ‌ శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి సోద‌రుడి కుమార్తె. సౌజన్య కేవలం హౌజ్ వైఫ్ మాత్రమే కాదు చాలా టాలెంటెడ్ ఉమెన్. సౌజన్య ఒక క్లాసిక‌ల్ డ్యాన్సర్. ఇప్పటికే ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

త్రివిక్రమ్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్ని ఏళ్లవుతున్న కూడా ఇప్పటి వరకు భార్య సంబంధించిన విషయాలు మాత్రం బయటికి రాలేదు.  మూడేళ్ల క్రిందట రవీంద్ర భారతిలో డాన్స్ చేసే వరకు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఇంత మంచి డాన్సర్ అనే విషయం ఎవరికీ తెలియలేదు. 2018లో ఈమె రవీంద్ర భారతిలో భరతనాట్యం డాన్స్ ప్రదర్శన ఇవ్వటం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.

Share
Mounika Yandrapu

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago