Traffic Challan : తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ట్రాఫిక్ చలాన్లపై బంపర్ ఆఫర్‌ను ప్రకటించిన విషయం విదితమే. డిసెంబర్ 25వ తేదీ వరకు ఉన్న అన్ని చలాన్లపై వాహన విభాగం వారిగా ప్రభుత్వం చలాన్లపై రాయితీలను ప్రకటించింది. అయితే ఈ మెగా లోక్ అదాలత్‌కు వాహనదారుల నుంచి భారీ ఎత్తున స్పందన లభిస్తోంది. పోలీసులు తెలిపిన ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 3.59 కోట్ల మేర పెండింగ్ చలాన్లు ఉన్నాయి. ఈ క్రమంలోనే వాటిపై ప్రభుత్వం రాయితీని ప్రకటించింది.
ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం, ఆర్‌టీసీ బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం మేర రాయితీని ప్రకటించారు. దీంతో వాహనదారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. కాగా డిసెంబర్ 26 నుంచి ఇప్పటి వరకు సుమారుగా 1 కోటికి పైగానే చలాన్లకు చెల్లింపులు జరిగాయని సమాచారం. రూ.70 కోట్ల వరకు చలాన్లు వసూలు అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాయితీలకు జనవరి 10వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది. కనుక వాహనదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పోలీసులు సూచించారు.
కాగా గతంలోనూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే భారీ ఎత్తున చలాన్లపై రాయితీలను ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతిసారి ఇలాంటి డ్రైవ్‌లలో వాహనదారులు పెద్ద ఎత్తున చలాన్లను కడుతున్నారు. ఇక ఇప్పుడు కూడా భారీగానే స్పందన లభిస్తోంది.