Tottempudi Venu : తొట్టెంపూడి వేణు తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. వేణు స్వయం వరం సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత మరి కొన్ని సినిమాల్లో హీరోగా నటించినా హీరోగా సక్సెస్ అవ్వలేకపోయాడు. కానీ వేణుకు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. హనుమాన్ జంక్షన్, పెళ్ళాం ఊరెళితే సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించాడు.
కొన్ని సినిమాలు చేసి ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయ్యాడు. దాంతో వేణును ప్రేక్షకులు చాలా మిస్ అయ్యారు. కాగా తాజాగా రామారావు ఆన్ డ్యూటీ సినిమాతో వేణు రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో వేణు పొలిటికల్ మరియు సినిమా బ్యాగ్రౌండ్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా వాళ్లతోపాటు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు వేణుకు దగ్గరి బంధువులు ఉన్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర రావు వేణుకి స్వయానా బావ అవుతారు. వేణు సోదరిని నామా వివాహం చేసుకున్నారు.
అంతే కాకుండా ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ వేణుకు స్వయానా మేనమామ అవుతాడు. అంతే కాకుండా నటసింహం నందమూరి బాలయ్య సైతం వేణుకు దగ్గరి బంధువు అన్న సంగతి చాలా మందికి తెలియదు. మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు వేణుకు పెదనాన్న అవుతారు. కావూరి సాంబశివరావు కూతురు కొడుకు (మనవడు) అయిన మెతుకు మిల్లి శ్రీ భరత్ బాలకృష్ణ చిన్న కూతురును వివాహం చేసుకున్నారు. అయితే వేణు సోదరి కుమారుడినే బాలయ్య చిన్న కూతురు వివాహం చేసుకుంది. ఆ లెక్కన బాలయ్య వేణుకు అన్నయ్య అవుతాడు. ఇక వేణు కూడా నందమూరి కుటుంబంకు చాలా దగ్గర గా ఉంటాడు. బయట ఫంక్షన్ లలో పెద్దగా కనిపించకపోయినా కూడా ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్, బాలయ్యలను పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…