Tomato Farmer : టమోటా ధరలు ఇప్పుడు ఏ రేంజ్‌లో ఉన్నాయో మనందరికి తెలిసిందే. కొద్ది రోజుల నుండి టమోటా ధరలు పైపైకి వెళుతున్నాయి. ఇకప్పుడు కిలో 10 రూపాయలు ఉన్న టమోటా ధరలు ఇప్పుడు వందకి పైనే ఉన్నాయి. దీంతో నిత్యం టమోటా వాడే వారు గగ్గోలు పెడుతున్నారు.ఇక టమోటా ధరలు పెరిగాక వాటికి సంబంధించి ఏదో ఒక వార్త నిత్యం నెట్టింట హల్చల్ చేస్తూనే ఉంది. రీసెంట్‌గా టమోటా పంట ద్వారా ఓ రైతు కోటీశ్వరుడు అయ్యాడు. మహారాష్ట్రలోని పూణేలోని జున్నార్‌కు చెందిన గైకర్ టమాటా సాగు చేయడం ద్వారా సమృద్ధిగా పండించాడు. అతని పొలంలోని పద్దెనిమిది ఎకరాల్లో పన్నెండు భూమిని అతని టమోటా పంటకు కేటాయించారు. తన కుమారుడు ఈశ్వర్ గైకర్, కోడలు సోనాలి సహకారంతో 12 ఎకరాల స్థలంలో టమోటా సాగు చేశాడు.
తుకారాం కుటుంబం వారు ఉపయోగించే ఎరువులు మరియు పురుగుమందుల వల్ల తమ టమోటాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. నారాయణగంజ్‌లో టొమాటో కార్టన్‌కు రూ.2100 సంపాదించాడు. శుక్రవారం 900 డబ్బాలను రూ.18 లక్షలకు విక్రయించాడు. నారాయణగంజ్ మార్కెట్‌లో టమాటా సగటు ధర రూ.2,100 చొప్పున విక్రయిస్తున్నారు. గైకర్ శుక్రవారం నాడు మొత్తం 900 డబ్బాలు అమ్మి ఒక్కరోజులోనే 18 లక్షలు ఇంటికి తీసుకొచ్చాడు. రైతు భాగోజీ తనకున్న 12 ఎకరాల్లో ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా టమాట సాగు చేశాడు. విచిత్రం ఏమిటంటే టమాటకు ఇంత ధర పెరుగుతుందని ఊహించలేకపోయాడు. జూలై 11, 2023న టొమాటో క్రేట్ ధర రూ.2100 (20 కిలోల క్రేట్). గైకర్ మొత్తం 900 టమోటా డబ్బాలను విక్రయించాడు. ఒక్కరోజులోనే రూ.18 లక్షలు సంపాదించాడు. గతంలో గ్రేడ్‌ను బట్టి ఒక్కో క్రేట్‌కు రూ.1000 నుంచి రూ.2400 వరకు ధరలు లభించాయి. దీంతో కోటీశ్వరుడయ్యాడు.
తుకారాంకు 18 ఎకరాల భూమి ఉంటే అందులో 12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. తుకారాం కోడలు సోనాలి మొక్కలు నాటడం, కోయడం, ప్యాకింగ్ చేయడం, కొడుకు ఈశ్వర్ అమ్మకాలు, నిర్వహణ, ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటున్నారు. మూడు నెలలుగా ఈ కుటుంబం పడిన కష్టానికి ఈరోజు వెయ్యి రెట్లు ఫలితం దక్కింది. గతంలో ఇంత ఎప్పుడు టమాటా ధర పెరగలేదని ఆయన చెబుతున్నాడు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు టమోటా విక్రయాలు రైతులను లక్షాధికారులుగా మార్చాయి. కర్నాటకలోని కోలార్‌కు చెందిన ఓ రైతు ఈ వారం 2 వేల డబ్బాల టమాటా అమ్మి రూ.38 లక్షలు ఇంటికి తీసుకొచ్చాడు.