Tilak Varma : టీమిండియాలో చోటు దక్కించుకోవాలనేది ప్రతి క్రికెటర్ కల. కాని అది అంత ఆషామాషీగా రాదు. ఎంతో కృషి, ప్రతిభ ఉంటే కాని అది సాధ్యం కాదు. మన తెలుగు గడ్డపై పుట్టిన క్రికెటర్స్ అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటడం చాలా తక్కువగా చూస్తుంటాం. తాజాగా విండీస్ టూర్‌కి మన తెలుగు బిడ్డ తిలక్ వర్మ ఎంపికై తెలగోళ్లు గర్వపడేలా చేశాడు. దేశవాళి క్రికెట్లో ఆడిన తిలక్ వర్మ గురించి పెద్దగా ఎవరికి తెలియదు. కానీ ఎప్పుడైతే ఐపీఎల్ లో ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తరఫున ఎంపికయ్యాడో.. అందరికీ సుపరిచితుడుగా మారిపోయాడు అని చెప్పాలి. అవకాశం దొరికిన మొదటి సీజన్లోనే తిలక్ వర్మ తన ఆట తీరుతో ఇక తానే టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్ అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.
గష్టు 3వ తేదీ నుంచి భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు టీ20 మ్యాచులు జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం తిలక్ వర్మ విండీస్ వెళ్లాడు. అయితే తన కొడుక్కి జాతీయ జట్టులో స్థానం దక్కడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు ఆయన తండ్రి నాగరాజు. ఈ ఛాన్స్ కోసం తన కొడుకు ఎంతో కష్టపడ్డాడని వారు చెప్పుకొస్తున్నారు. విజయ్ మర్చంట్ ట్రోఫీ, కూచ్ బెహార్ ట్రోఫీ , కల్నల్ సీకే నాయుడు (అండర్23) వంటి దేశవాళీ టోర్నీల్లోనూ పరుగుల మోత మోగించడంతో 2018లో అండర్19 వరల్డ్ కప్‌లో ఆడే అవకాశం అతనికి లభించింది. ఇక 2019లో హైదరాబాద్ రంజీ జట్టులోకి వచ్చి సత్తా చాటాడు. ఇక, 2022లో రూ.20 లక్షల కనీస ధరతో ఐపీఎల్ వేలంలోకి వచ్చిన తిలక్ వర్మను ముంబై ఇండియన్స్ ఏకంగా రూ.1.70 కోట్లకు సొంతం చేసుకోవడంతో అతని దశ తిరిగింది.
దాంతో ఆర్థిక సమస్యలన్నీ తీరిపోవడంతో తిలక్ ఆటపైనే దృష్టి పెట్టాడు. తండ్రి ఎలక్ట్రీషియన్ కావడంతో వీరి కుటుంబ ఆర్థిక స్థోమత అంతంత మాత్రమే. అందరిలానే టెన్నిస్ బాల్ తో క్రికెట్ ను ఆరంభించిన తిలక్ వర్మను కోచ్ సలామ్ బయాష్ తీర్చి దిద్దాడు. స్టడీస్ డిస్ట్రబ్ కాకుండా గేమ్ పై దృష్టి పెట్టమని చెప్పాం. అండర్ 14 తర్వాత మాలో కాన్ఫిడెంట్ పెరిగింది. అండర్ 16లో తిలక్ వర్మటాలెంట్ మాతో పాటు కోచ్‌కి బాగా తెలిసొచ్చింది. అలా మేం ఎంకరేజ్ చేయడం, అతను రాటుదేలి జట్టులో చోటు సంపాదించడం జరిగిందని తిలక్ వర్మ తండ్రి నాగరాజు అన్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…