Thummala Nageshwar Rao : చంద్ర‌బాబుపై ఆసక్తిక‌ర కామెంట్స్ చేసిన తుమ్మ‌ల‌.. ఏమ‌న్నారంటే..?

Thummala Nageshwar Rao : టాలీవుడ్ సీనియర్‌ నటుడు, నిర్మాత మురళీ మోహన్‌ నటుడిగా 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైద‌రాబాద్‌లోని శిల్పకళావేదికలో గోల్డెన్‌ జూబ్లీ సెలబ్రేషన్స్ ఘ‌నంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా భారీ దండ‌తో మురళీమోహన్‌ను సత్కరించారు. ఇక మురళీ మోహన్ అభిమానులు పెద్దయెత్తున హాజరై ఆయన సినీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ మురళీ మోహన్ యాభై ఏళ్ల సినీ ప్రస్థానం ఒక రికార్డు అని, అది కొందరికే సాధ్యమవుతుందని స్ప‌ష్టం చేశారు.

తెలుగు జాతి బతికున్నంతకాలం వినబడే వ్యక్తి ఎన్టీఆర్ అంటూ ప్రశంసించారు. మురళీ మోహన్ 350 సినిమాల్లో నటించారని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఏ ఎన్నికలు వచ్చినా మురళీ మోహన్ తప్పకుండా ప్రచారం చేసేవారని చెప్పారు. రాజమండ్రి ఎంపీగా గెలిచి అక్కడి ప్రజలకు సేవలందించారని చంద్రబాబు గుర్తు చేశారు. మురళీమోహన్ మనసుపెట్టి ఏ పనైనా చేస్తాడని ప్రశంసించారు. తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కృష్ణంరాజు సతీమణి, గురవారెడ్డి, నర్సాపురం పార్లమెంట్‌ సభ్యులు రఘురామకృష్ణంరాజు, సుజనా చౌదరి, కోటా శ్రీనివాసరావు, కీరవాణి, రాజమౌళి, అశ్వనీదత్‌ తదితరులు కూడా ఈ కార్య‌క్ర‌మంలో సంద‌డి చేశారు.

Thummala Nageshwar Rao interesting comments on chandra babu
Thummala Nageshwar Rao

కార్య‌క్ర‌మంలో 50 మురళిలతో కూడిన దండతో మురళీమోహన్‌ను సత్కరించారు. 50 ఏళ్ల క్రితం తనకు తొలి అవకాశం ఇచ్చిన అట్లూరి పూర్ణచంద్రరావుకి మురళీమోహన్‌ ఒక కారును బహుమతిగా అందజేశారు. అయితే తుమ్మ‌ల ఈ కార్యక్ర‌మంలో చంద్ర‌బాబు గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. పూజ్యులు, నా ఉన్న‌తికి తోడ్ప‌డి న‌న్ను ఇంత వాడిని చేసి ఇప్పుడు మంత్రిగా మీ ముందు ఉంచింది బాబుగారే అని అన్నారు.ఔటర్ రింగ్ రోడ్, జీనోమ్ వ్యాలీ, అంతర్జాతీయ విమానాశ్రం హైదరాబాద్ కే తలమానికంగా నిలిచాయన్నారు . హైదరాబాద్ నాలెడ్జ్ హబ్ గా మార్చిన ఘనత టీడీపీకే దక్కుతుందన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago