Varaha Rupam : కన్నడ సినిమా ‘కాంతార’ చిత్రం దేశ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. హొంబలే ఫిలింస్ నిర్మించిన ‘కాంతార’ మూవీ రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయనే హీరోగా తెరకెక్కగా, ఈ సినిమా రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందింది. ఈ సినిమా కథ ప్రతి ఒక్కరిని అలరించడంతో మూవీకి ఏకంగా రూ. 400 కోట్లు వసూళ్లు చేసింది. ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘వరాహరూపం’ పాట కాపీ రైట్స్ వివాదంలో చిక్కుకుంది. ఈ పాట తమ పాట నుంచి కాపీ కొట్టారంటూ తైక్కుడం బ్రిడ్జ్ ఆల్బమ్ టీమ్ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
పాటపై కేసు విచారణ జరిపిన న్యాయ స్థానం ఈ పిటీషన్ ను కొట్టివేస్తూ వరహ రూపం పాట మీద ఉన్న బ్యాన్ ను ఎత్తివేసింది. ఈ నేపథ్యంలో ‘కాంతార’ ఓటీటీ వెర్షన్ లోనూ అప్ డేట్ అయ్యింది.అయితే ‘వరాహ రూపం’ పాట విషయానికి వస్తే దీనిని కొత్త మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్ తో రీక్రియేట్ చేసారు. ఇక ఈ పాట ఎవరు పాడారు అనే ఆసక్తి అందరిలో ఉంది. ఆమె మరెవరో కాదు పాడుతా తీయగాతో పాటు ఎన్నో సింగింగ్ కాంపిటీషన్స్లో పాల్గొని సత్తా చాటిన శ్రీ లలిత . బోల్ బేబీ బోల్, సూపర్ సింగర్, పాడుతా తీయగా, స్వరాభిషేకం, స్వర నీరాజనం, సరిగమప లిటిల్ ఛాంప్స్ లాంటి ప్రోగ్రాంలతో మమంచి క్రేజ్ దక్కించుకున్న శ్రీ లలిత ఇటీవల కాంతార సినిమాలోని పాపులర్ సాంగ్ ‘వరాహ రూపం’ పాటను పాడి అందరి దృష్టిని ఆకర్షించింది.
కజు అనే డిఫరెంట్ సంగీత వాయిద్యంతో పూర్తి పాటను రీక్రియేట్ చేసి ట్రెండ్ సెట్ చేసింది. కాంతారలో ఒరిజినల్ సాంగ్ ని మేల్ సింగర్ పాడగా, రీక్రియేషన్ లో శ్రీలలిత.. అందరికీ కజు ఇన్ స్ట్రుమెంట్ ని పరిచయం చేస్తూనే.. అద్భుతంగా పాడింది. ప్రస్తుతం శ్రీలలిత రీక్రియేట్ చేసిన వరాహ రూపం సాంగ్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈమె పాటకు తెలుగు భాషలోనే కాదు వివిధ భాషలలోను మంచి రెస్పాన్స్ వస్తుంది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…