Jr NTR : చంద్రబాబుది అక్రమ అరెస్ట్ అంటూ తెలుగు రాష్ట్రాలలోనే కాక దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. కొందరు సినీ ప్రముఖులు కూడా చంద్రబాబు అరెస్ట్‌ని తీవ్రంగా ఖండిస్తున్నారు. జగన్ ప్రభుత్వం కక్షపూరితంగానే జగన్‌ని అరెస్ట్ చేసిందని అంటున్నారు. బండ్ల గణేష్, రాఘవేంద్రరావు, అశ్వినీదత్ వంటి వారు చంద్రబాబు అరెస్ట్‌ని తప్పు పడుతూ దారుణమైన విమర్శలు చేశారు. అయితే ఇప్పటి వరకు చంద్రబాబు అరెస్ట్‌పై జూనియర్ ఎన్టీఆర్ కాని, కళ్యాణ్ రామ్ కాని స్పందించకపోవడం హాట్ టాపిక్‌గా మారింది.
2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి విస్తృత ప్రచారం చేశారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ గత 8 యేళ్ళుగా సినిమాలతో బిజీగా వుంటూ రాజకీయం వైపు వెళ్ళలేదు జూనియర్ ఎన్టీఆర్. కాని ప్రస్తుత తరుణంలో సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు. టీడీపీ లోని ఒక వర్గం నేతలు పార్టీలోకి రావడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. ఏపి లో టిడిపి నీ బతికించాలి అంటే అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ వల్లే సాధ్యం అని భావిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ రాకను కొంతమంది సీనియర్ నేతలు బహిరంగంగానే వ్యతిరేకీస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ మద్య అచ్చెనాయుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ తాము ఎవరిని స్పందించమని కోరమని, పార్టీకి ఎవరో వచ్చి ఏదో చేయాలని ఆశించడం లేదంటూ వ్యాఖ్యానించారు. అటు నందమూరి బాలకృష్ణ కూడా ఇదే రకంగానే స్పందించారు. దీంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని సీనియర్ నేతలే అడ్డుకుంటున్నారనేది కొందరి అభిప్రాయం.ఆ కారణాల చేతనే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్ట్ పై ఇంతవరకు స్పందించలేదని కొందరి వాదన. ఎన్టీఆర్ స్పందించిన కూడా అది నెగెటివ్‌గానే వెళుతుందని, ఈ క్రమంలో తను రాజకీయాలలోకి వెళ్లకుండా తనపని తాను చేసుకుంటూ ముందుకు వెళితే ఎలాంటి సమస్య ఉండదనే అభిప్రాయంతోనే మౌనంగా ఉన్నాడని కొందరు అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల చుట్టూ స్కామ్ లు అలుముకుంటున్న వేళ ముందు రోజుల్లో టీడీపీని ఎవరు లీడ్ చేస్తారో చూడాలి.