మనుషులని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారని అంటుంటారు. అయితే ఇటీవల సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరగడం వలన అటువంటి వారు మనకు కనిపిస్తున్నారు. సినిమా ఇండస్ట్రీలోను ఒకే ఫేస్ కట్తో ఉన్న హీరోస్ కొందరు ఉన్నారు. కొన్నిసార్లు ఒకరితో ఒకరికి సంబంధం లేకపోయినా కాస్త పోలికలు దగ్గరగా ఉంటాయి. అయితే మన టాలీవుడ్ విషయానికొస్తే కొంత మంది అక్క చెల్లెలు హీరోయిన్స్ గా రాణించి లేదా ఒకరు ఇండస్ట్రీలో ఉండి మరొకరు లేకపోయినా అచ్చం కవల పిల్లల్ల ఉండే కొంతమంది హీరోయిన్స్ ఉన్నారు. అలా హీరోలు కూడా ఉన్నారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ గురించి మనం కొత్తగా తెలుసుకోవాల్సింది లేదా. కానీ ఈయన లాగే ఉండే మరో నటుడు సోనూ సూద్. బిగ్ బి యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు సోనూసూద్లానే ఉంటాడు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కేజీఎఫ్ లో హీరో అయినా కన్నడ నటుడు యష్ కొన్ని యాంగిల్స్ లో ఒకేలా ఉంటారు.కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఇటీవల లవ్ టుడే తో ప్రేక్షకులను అలరించిన నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ కూడా దాదాపు ఒకే లుక్లో కనిపిస్తారు. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, అతడి కజిన్ విక్రాంత్ కొంచెం ఒకేలా ఉంటారు. అలాగే రాజా రాణి లో ఒక హీరో గా నటించిన జై కూడా చూడటానికి విజయ్ లనే ఉంటాడు. ఇక నాచురల్ స్టార్ నాని, అలాగే కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ కూడా చూడటానికి ఒకేలా కనిపిస్తారు. అలాగే వారిద్దరి కామెడీ టైమింగ్ కూడా ఒకేలా ఉంటుందని చాలా మంది అంటుంటారు.
మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లానే ఉంటాడు మరో తెలుగు నటుడు. అతను ఎవరో కాదు హీరో ప్రిన్స్. పలు చిన్న చిత్రాల్లో హీరోగా నటించిన ప్రిన్స్ కొన్ని యాంగిల్స్ లో మహేష్ లానే కనిపిస్తాడు. మనోడు బిగ్ బాస్ లో కూడా సందడి చేశాడు. ఎనర్జిటిక్ స్టార్ రామ్, అలాగే యువ నటుడు అరుణ్ అదిత్ కూడా చూడటానికి ఒకేలా ఉంటారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ లాగే మరో హీరో నిఖిల్ ద్వివేది ఉంటారు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, హాలీవుడ్ హీరో టామ్ హాంక్స్ ఒకేలా ఉంటారు. ఇదే మాదిరిగా హీరోయిన్స్ కూడా కొందరు సేమ్ ఫేస్ కట్ తో ఉంటారు.