YS Jagan : మే 13వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వచ్చాయి. ఈ ఫలితాలలో టీడీపీ-చంద్రబాబు- పవన్ కళ్యాణ్ కూటమి ఘన విజయం సాధించింది.అయితే జగన్ ఓటమికి కారణం ఏంటనేది ఇప్పడు విశ్లేషిస్తున్నారు. సంక్షేమంతో జనాల మెప్పు పొందిన జగన్ ఈ ఐదుగురు వలన చేతులు కాల్చుకున్నాడని అంటున్నారు. అవతలి వారిని తిడినే జగన్ పాపులారిటీ పెరుగుతుందనుకున్న వారు ఆయన పార్టీ కూటమి ప్రవాహంలో కొట్టుకుపోయేలా చేశారు. ఈ పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఉన్న కొడాలి నాని 2004నుంచి వరుసగా గుడివాడలో గెలుస్తూ వచ్చారు.. ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు స్థానికంగా కొడాలి నానిపై వ్యతిరేకత పెరగడంతో ఈసారి ఆయనకి ఓటమి తప్పలేదు.
రోజా.. నగరి నుంచి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించింది. కాని దారుణమైన పరాజయం చవి చూసింది. జగన్ మెప్పు పొందాలని ఆమె ప్రతిపక్ష నాయకులపై తీవ్రంగా విరుచుకుపడింది. పరుష పదజాలంతో ఆమె మాట్లాడిన మాటలు చాలా మందికి చిరాకు తెప్పించాయి. రోజాకు టికెట్ ఇచ్చినా గెలవదని పార్టీ నేతలు మొదటే జగన్ దృష్టికి తీసుకెళ్ళినా ఆయన మాత్రం రోజాపైనే నమ్మకం ఉంచారు. అయినప్పటికీ నేతలను సమన్వయం చేసుకోవడంలో రోజా విఫలమయ్యారు. తన వెంట ఎప్పుడు ఉన్నాడని అంబటి రాంబాబుకి జగన్ నీటిపారుదల శాఖా మంత్రిగా పదవి ఇచ్చారు. ఈ సారి ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి పోటీ చేసిన ఆయన స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఆయన దారుణమైన కామెంట్స్ చేయడం, డ్యాన్స్ లు చేయడంతో ఓటమి పాలయ్యారు అనేది జనాలు చెబుతున్న మాట.

ఇక వాలంటీర్ల వ్యవస్థ తమ ఓటమికి కారణమని వారి మీద నెట్టేసిన ఘనుడు మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్. ఆయన ఐటీ మినిస్టర్‌గా ఉంటూ తెలుగు వాళ్లకి తెలియని సామెతలు చెప్పడం, మీడియా వాళ్లు అడిగిన ప్రశ్నలకు వెటకారంగా సమాధానాలు ఇవ్వడం ద్వారా తగిన మూల్యం చెల్లించుకున్నాడు. పవన్ కళ్యాణ్ నాతో అడిగి సెల్ఫీ తీయించుకున్నాడంటూ కొన్నిసార్లు కుళ్లు జోకులు వేయడంతో గాజువాక ప్రజలు ఆయనని బాగానే ఇంటికి పంపారు. ఇక పేర్ని నాని.. జగన్ మనిషిగా మంచి పేరు ఉంది. అయితే మంత్రి పదవి అందుకున్న తర్వాత ఆయనని పవన్ కళ్యాణ్ ని తిట్టే మంత్రిగానే అందరికి అర్ధమైంది.మా నాయుడు, పవన్ నాయుడు అంటూ బందర్ వాళ్ల కన్నా వెటకారాలు వేశాడు. అయితే ఆయన ఎన్నికలలో తప్పుకున్న ఆయన కొడుకుని నిలబెట్టాడు. తండ్రి తీసుకొచ్చిన పేరు ప్రతిష్టలు మోయలేక పేర్ని నాని తనయుడు బొక్కబోర్లా పడ్డాడు.