నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ స్పెథ్రిల్లర్ ఘోస్ట్. ది ఘోస్ట్ దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యాక్షన్ సీన్స్‌తో అదుర్స్ అనిపించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో వసూళ్లను రాబట్టలేకపోయింది. ఒక రకంగా నాగార్జున కెరీర్‌లో అత్యంత తక్కువ వసూళ్లను సాధించి అభిమానులతో పాటు ట్రేడ్‌కు షాక్ ఇచ్చింది. ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు సోనాలీ చౌహాన్, గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్, రవివర్మ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు.
శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లపై నారాయణ్ దాస్ నారంగ్, సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్‌లతో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ : రూ. 6.08 కోట్ల షేర్లు. ది ఘోస్ట్ తెలుగు వెర్షన్ 22.8 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ.కోటి షేర్ రాబట్టాలి. బ్రేక్ ఈవెన్ కోసం 23 కోట్లు. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి కేవలం రూ. 6.08 కోట్లు మాత్రమే వచ్చాయి.
ఓవరాల్ గా చూస్తే బయ్యర్లకు రూ.16.92 కోట్ల నష్టం మిగిల్చినట్లు స్పష్టమవుతోంది. దీన్నిబట్టి ఘోస్ట్ డిజాస్టర్ అని స్పష్టమవుతుంది. మొత్తంగా నాగార్జున గతేడాది విడుదలైన వైల్డ్ డాగ్ మూవీకి మంచి టాక్ వచ్చిన మంచి వసూళ్లను రాబట్టేలేకపోయింది. ది ఘోస్ట్ మూవీకి విషయానికొస్తే.. అంత కంటే ఘోరం అని చెప్పవచ్చు. మొత్తంగా నాగార్జున కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించలేకపోతున్నారు. తాజాగా ది ఘోస్ట్ మూవీ ఫలితంతో అది మరోసారి ఋజువు అయింది.