The Ashes 2023 : యాషెస్ సిరీస్ లో ఐకానిక్ మూమెంట్.. ఆ మ‌హిళ తెగ న‌వ్వించేసిందిగా..!

The Ashes 2023 : ప్ర‌స్తుతం ఇంగ్లండ్- ఆస్ట్రేలియాల మ‌ధ్య యాషెస్ సిరీస్ ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న విష‌యం తెలిసిందే. గురువారం మూడో టెస్ట్ మొద‌లు కాగా, ఈ టెస్ట్‌లో కూడా ఆస్ట్రేలియా ఆధిప‌త్యం కొనసాగిస్తుంది.ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 ప‌రుగుల‌కి ఆలౌట్ కాగా, ఇంగ్లండ్ మూడు వికెట్స్ కోల్పోయి 69 ప‌రుగులు చేసింది. మొదటి రెండు టెస్టుల్లో ఓటమిపాలైన ఇంగ్లాండు జట్టు ఈ టెస్ట్ లో ఎలాగైనా విజయం సాధించాలన్న లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. హెడ్డింగ్లెలోని లీడ్స్ వేదికగా జరగనున్న మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు పలు మార్పులతో బరిలోకి దిగింది.

మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక చతికిల పడిన ఆటగాళ్లను తప్పించి.. వారి స్థానంలో సీనియర్ ఆటగాళ్లకు ఇంగ్లాండ్ జట్టు చోటు కల్పించింది. అయితే ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాకి గ‌ట్టి పోటే ఇస్తుంది. మొదటి టెస్ట్ లోను, రెండో టెస్టులోనూ విజయానికి దగ్గరగా వచ్చి ఇంగ్లాండ్ జట్టు విజయాన్ని చేజార్చుకుంది. ఇంగ్లాండ్ జట్టుకు గత కొన్నాళ్లుగా విజయాలను అందించి పెడుతున్న బజ్ బాల్ వ్యూహం కూడా విజయాలను అందించడం లేదు. వేగంగా ఆడి ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి పెంచాలన్న ఇంగ్లాండ్ వ్యూహం ఈ సిరీస్ లో మాత్రం బెడిసి కొడుతోంది.

The Ashes 2023 woman felt comedy
The Ashes 2023

వేగంగా ఆడే క్రమంలో వికెట్లను పోగొట్టుకుంటున్న ఇంగ్లాండు జట్టు విజయానికి దగ్గరగా వచ్చి నిలిచిపోతోంది.మొదటి రెండు టెస్టుల్లో జరిగిన తప్పిదాల నుంచి గుణ పాఠాలు నేర్చుకుని మెరుగైన ప్రదర్శన చేసే ప్ర‌య‌త్నం చేస్తుంది. అయితే ఈ సిరీస్ లో కొన్ని యాకానిక్ మూమెంట్స్ చోటు చేసుకుంటున్నాయి. తాజా మ్యాచ్‌లో జో రూట్ బంతి వేస్తున్న స‌మ‌యంలో ఆడియ‌న్స్ లోని ఓ మ‌హిళ చైర్‌లో కూర్చోబోయి కింద ప‌డింది. అది లైవ్‌లో ప్ర‌త్య‌క్షమైంది. బిగ్ స్క్రీన్ మీద కూడా ఆ స‌న్నివేశం క‌నిపించే స‌రికి క్రికెట‌ర్స్ కూడా న‌వ్వుకున్నారు. ఈ వీడయో నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago