Thatikonda Rajaiah : రాజ‌య్య‌.. మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

Thatikonda Rajaiah : బీఆర్ఎస్‌లో రాజకీయ సమీకరణాలు ఎప్పటికప్పుడు రంజుగా మారుతున్నాయి. టికెట్లు రాని వాళ్లు తలోదారి వెతుక్కుంటుండ‌గా, ఇందులో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిస్థితే కొంత అయోమయంగా ఉంది. నిన్నటి వరకు కేసీఆర్ చెప్పినంటూ వింటా అని.. ఇప్పుడేమో రేపోమాపో నేను అనుకున్నది కార్యక్ర‌మం జరుగుతుంద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆరునూరైన ప్రజాక్షేత్రంలోనే ఉంటానని స్పష్టం చేశారు.ధర్మసాగర్ మండలంలో బీసీలకు లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రాజయ్య.. ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు.

దుక్కి దున్ని, నారు పోసి, కలుపుతీసి, పంట పండించి, కుప్ప పోశాక.. ఆ కుప్ప మీద ఎవరో వచ్చి కూర్చుంటానంటే ఊర్కుంటామా అంటూ ప్రశ్నించారు. పైన దేవుడున్నాడని.. దేవుడు లాంటి కేసీఆర్ ఉన్నారన్న రాజయ్య.. రేపోమాపో తాను అనుకున్న కార్యక్రమం జరుగనుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల కోసమే తానున్నానని.. ప్రజల మధ్యలోనే చచ్చిపోతానని చెప్పుకొచ్చారు.అయితే రాజ‌య్య మాట‌లు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఆయ‌న తీరు చూస్తుంటే రాజ‌య్య జంప్ అయ్యేట్టుగా క‌నిపిస్తున్నాడ‌ని కొంద‌రు అంటుంటే మ‌రి కొంద‌రు మాత్రం బీఆర్ ఎస్ లోనే ఉండితీరుతాడ‌ని చెబుతున్నారు. క‌డియం శ్రీహరికి బీఆర్ఎస్ స్టేషన్ ఘనపూర్ టికెట్ కేటాయించడంతో రాజయ్య అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ మారాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలో రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు.

Thatikonda Rajaiah again sensational comments
Thatikonda Rajaiah

అయితే టికెట్ రాలేదన్న బాధతో మొన్న స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద కార్యకర్తలను చూసి భోరున విలపించిన రాజయ్య.. కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటానని ఆవేదనతో చెప్పారు. తన స్థాయికి తగిన పదవి ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆయన మాట మీద తనకు నమ్మకం ఉందని చెప్పుకొచ్చారు. తన అభిమానులందరూ సంయమనం పాటించాలంటూనే కిందపడి వెక్కి వెక్కి ఏడ్చారు. అయితే.. ఉన్న కొన్ని రోజుల్లో అభివృద్ధి కార్యక్రమాలన్ని పూర్తి చేస్తానంటూ చెప్పుకొచ్చారు.

Share
Shreyan Ch

Recent Posts

క్షీణించిన వినోద్ కాంబ్లి ఆరోగ్యం.. హాస్పిట‌ల్‌లో చికిత్స‌..

భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ప్లేయ‌ర్ వినోద్ కాంబ్లి ప‌రిస్థితి ప్ర‌స్తుతం విష‌మంగా ఉన్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కుటుంబ స‌భ్యులు…

3 weeks ago

సినిమాల్లో పోలీసులు చివ‌ర్లోనే ఎందుకు వ‌స్తారు.. అందుకు వ‌ర్మ స‌మాధానం ఇదే..!

రామ్ గోపాల్ వ‌ర్మ‌.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈయ‌న ఎక్క‌డ ఉంటే అక్క‌డ వివాదాలు చుట్టూ ఉంటాయి.…

3 weeks ago

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

4 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

4 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

4 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

4 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

4 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

4 months ago