Temple To Samantha : హీరోయిన్స్ కి అభిమానులు గుడులు కట్టడం మనం చూస్తూనే ఉన్నాం. నిధి అగర్వాల్‌కి ఇటీవల తమిళనాట గుడి కట్టారు. ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతకి గుడి కట్టే సమయం ఆసన్నమైంది. సమంతకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని బాపట్ల నివాసి సందీప్ వీరాభిమాని కాగా, ఆమె మాయోసైటిస్ బారిన పడినప్పుడు కోలుకోవాలంటూ తిరుపతి, చెన్నై, నాగ పట్నంలో మొక్కుబడి యాత్ర చేశారు. ఇప్పుడు ఏకంగా సమంతకు గుడి కడుతున్నాడు. బాపట్లలోని ఆలపాడు సందీప్ స్వస్థలం కాగా, ఆలపాడులోని తమ సొంత ఇంట్లో సామ్ కోసం అతను గుడి కడుతున్నాడు.
ప్రస్తుతం గుడి నిర్మాణ పనులు జోరుగా, శర వేగంగా జరుగుతుండగా, ఆమె బర్త్ డే రోజు అయిన ఏప్రిల్ 28న ఆ రోజు గుడి నిర్మాణ పనులు పూర్తి అవుతాయట. ఆ రోజే టెంపుల్ ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. చైతూ నుండి విడిపోయిన తర్వాత సమంతని చాలా మంది విమర్శిస్తూ వస్తున్నారు. కాని కొందరు ఇంకా ప్రేమిస్తూనే ఉన్నారు. ఇటీవల సమంత శాకుంతలం చిత్రంతో ప్రేక్షకులని పలకరించిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ‘శాకుంతలం’ సినిమా తన అభిమానులను నిరాశ పరిచింది. సామ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఖుషీ చిత్రంలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్’ ఇండియన్ వెర్షన్ లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇప్పుడు సమంత ఇండియాలో లేరు. కొన్ని రోజుల క్రితం లండన్ వెళ్లారు. అక్కడ ప్రియాంకా చోప్రా నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ ప్రీమియర్ షోకి అటెండ్ అయ్యారు. సేమ్ టైటిల్ తో రూపొందుతున్న ఇండియన్ వెర్షన్ ‘సిటాడెల్’లో ఆమె యాక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆ వెబ్ సిరీస్ షూటింగ్ చేస్తున్నారు. బర్త్ డే రోజు కూడా షూటింగులో ఉంటారని, హాలిడే తీసుకోవడం లేదని ఫిల్మ్ నగర్ వర్గాల ద్వారా తెలుస్తుంది. సమంత నటించిన ఖుషీ చిత్ం విడుదలకి సిద్దంగా ఉంది.