తెలుగుజాతి ఉన్నంతవరకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మన గుండెల్లో ఉంటారని సామాజిక కార్యకర్త, ఐటీ ప్రొఫెషనల్ తేజస్వి పొడపాటి చెప్పుకొచ్చాడు. చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పేందుకు ఐటీ ఉద్యోగులు హైదరాబాదులో సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్ ఏర్పాటు చేయగా, ఈ కార్యక్రమానికి తేజస్వి హాజరయ్యారు. ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ.. ‘‘విశ్వనగరానికి చంద్రబాబు పునాది వేసి 25 ఏళ్లు అయ్యింది. ఈ గచ్చిబౌలి స్టేడియం నుంచి ఎందరో క్రీడాకారులు ఎదిగారు. ఆలోచనను ఆచరణలో పెట్టిన నాయుకుడు చంద్రబాబు. రాళ్లలో మహానగరాన్ని సృష్టించిన నాయకుడు చంద్రబాబు. ఆడపిల్లల జీవితాలను మార్చిన గొప్ప నాయుడు చంద్రబాబు. కట్నం ఇచ్చే స్థాయి నుంచి ఎదురు కట్నం తీసుకునే స్థాయికి ఎదిగాం’’ అని తేజస్వీ చెప్పుకొచ్చారు.
ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంటే అమెరికా ఇటువైపు చూసేలా చంద్రబాబు చేశారని, ప్రధానమంత్రి పదవిని కూడా వదులుకున్నారని తేజస్విని అన్నారు. కృతజ్ఞతా కచేరికి పెద్ద సంఖ్యలో హాజరైనవారిని ఉద్దేశించి ఆమె భావోద్వేగంగా మాట్లాడారు. చంద్రబాబు ఎవరి కోసమైతే కష్టపడ్డారో వారందరూ ఇక్కడికి వచ్చారని తేజస్విని అన్నారు. తెలుగుజాతి ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో బాబు నిలిచిపోతారని వ్యాఖ్యానించారు. మంచి చేసిన నాయకులను, జీవితాలను మార్చిన నాయకత్వాన్ని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటున్నారని తెలియజేయడానికి ఈ కృతజ్ఞత కచేరి అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
మంచి చేసిన టీడీపీ అధినేత నారా చంద్రబాబును తెలుగు ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని తెలుగు ప్రొఫెషనల్స్ సంఘం అధ్యక్షురాలు తేజస్విని అన్నారు. రాష్ట్రాన్ని తన కుటుంబంగా మార్చుకుని విద్యార్థులు, యువత కోసం తపన పడిన వ్యక్తి అని ప్రశంసించారు. ఐఎస్‌బీ, ట్రిపుల్‌ఐటీ, గచ్చిబౌలి స్టేడియం, మైక్రోసాఫ్ట్, జీనోమ్‌వ్యాలీ ఇలా ఎన్నో సృష్టించారని పొగిడారు. హైదరాబాద్‌లో ‘సైబర్‌టవర్స్’ నిర్మాణం జరిగి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన ‘సీబీఎన్స్ గ్రాటిట్యూడ్ కాన్సర్ట్’ ఈవెంట్‌లో ఆమె చాలా ఉద్వేగభరితంగా మాట్లాడారు. తేజస్విని మాట్లాడిన వీడియోని టీడీపీ కూడా ట్విటర్ వేదికగా షేర్ చేసింది.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…