Teja Sajja : తేజా సజ్జా హీరోగా వచ్చిన తాజా సినిమా హనుమాన్ గురించి అందరికీ తెలిసిందే. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టుకుంటూ అనేక రికార్డులను క్రియేట్ చేస్తుంది. ఎవరూ ఊహించని విధంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు పెద్ద ఎత్తున ప్రశంసలు వస్తున్నాయి. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్ సినిమాలో తేజా సజ్జా సరసన అమృతా అయ్యర్ హీరోయిన్ గా నటించింది. విజ్యువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ లు సంగీతం అందించారు… తెలుగుతో పాటు హిందీ, మరాఠీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్‌తో సహా పలు భారతీయ భాషల్లో విడుదల అయిన ఈ సినిమాకు విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
టికెట్లు అందుబాటులోకి వచ్చిన కాసేపటికే థియేటర్లు ఫుల్ అయిపోతున్నాయి. అయితే రిలీజ్‌కి ముందు ఈ సినిమాకి అనేక ఇబ్బందులు తలెత్తాయి. ముఖ్యంగా దిల్ రాజు ఈ సినిమాకి అడ్డుగా నిలిచాడని టాక్ నడిచింది. సంక్రాంతికి ఈ సినిమా రాకుండా చేశాడని అన్నారు. అయితే ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం సాధించింది. అన్నిచోట్ల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులంతా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు. బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా సర్‌ప్రైజింగ్ ఉంది. నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది. కానీ, ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలీదు. ఇలాంటి వారి నుంచి వస్తున్న స్పందన చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇంత ఎక్స్‌ట్రార్డినరీ ఓపెనింగ్స్, నెంబర్స్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది” అని తేజ సజ్జ సంతోషం వ్యక్తం చేశాడు.
హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్రంగా నిలిచిపోతుంది. ఈ విజయం ప్రేక్షకులందరిది. అందరూ గొప్పగా ఆదరించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనేదానికి హను-మాన్ నిదర్శనం. ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ఎదో ఒక దైవశక్తి మమల్ని నడుపుతుందని బలంగా నమ్ముతున్నాను” అని తెలిపాడు.హను మాన్ అన్నీ ఒరిజినల్‌గా చేసినవే. అండర్ వాటర్ సీక్వెన్స్, క్లైమాక్స్‌లో గాల్లో ఉండే సీక్వెన్స్ ఇవన్నీ రియల్‌గా చేశాం. ఎయిర్ సీక్వెన్స్‌లో పొద్దున్న మేకప్ వేసుకొని రోప్ ఎక్కితే మళ్లీ సాయంత్రానికి దిగేవాడిని అని పేర్కొన్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…