Teja Sajja Net Worth : హనుమాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరిస్తోంది. మూవీ రిలీజ్ అయి ఇప్పటికి చాలా రోజులు గడుస్తున్నా ఇంకా థియేటర్లలో రష్ తగ్గడం లేదు. అసలు కొన్ని చోట్ల అయితే టిక్కెట్లు లభించడం లేదు. అంతటి ఘన విజయాన్ని ఈ మూవీ సొంతం చేసుకుంది. పాన్ ఇండియా లెవల్‌లో ఈ మూవీని రిలీజ్ చేయడంతో నటుడు తేజ సజ్జాకు విపరీతమైన పాపులారిటీ వచ్చేసింది. ఈ క్రమంలోనే తేజ ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. అతని గురించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక తేజ సజ్జాకు చెందిన పలు ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
హనుమాన్ మూవీ బంపర్ హిట్ అయి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. అయితే ఈ మూవీకి అతను రూ.1 కోటి మాత్రమే రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. కానీ మూవీ హిట్ అయింది కనుక నిర్మాతలు అతనికి ఇంకా ఎక్కువ పారితోషికమే ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక తేజకు లగ్జరీ కార్లు అంటే ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే అతని వద్ద పలు విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. లెక్సస్, క్రిస్టగా, ఈఎస్, ఆడి వంటి కంపెనీలకు చెందిన కార్లు తేజ వద్ద ఉన్నట్లు సమాచారం.
![Teja Sajja Net Worth : హనుమాన్ మూవీ ఫేమ్ తేజ సజ్జా ఆస్తి ఎంతో తెలుసా..? ఈ మూవీకి అతను ఎంత తీసుకున్నాడు అంటే..? Teja Sajja Net Worth and total properties value hanuman movie remuneration](http://3.0.182.119/wp-content/uploads/2024/01/teja-sajja-1.jpg)
తేజ సజ్జా హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అక్కడ అతనికి ఒక పెద్ద ఇల్లు కూడా ఉందట. అతని ఆస్తి ప్రస్తుతం సుమారుగా రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. కానీ స్టార్ నటుడు అయ్యాడు కనుక భవిష్యత్తులో ఈ మొత్తం ఇంకా పెరిగే చాన్స్ ఉంది. ఇక తేజ సజ్జా సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉంటాడు, అప్పుడప్పుడు చారిటీల్లోనూ పాల్గొంటాడు, పేదలకు తనవంతు సహాయం చేస్తుంటాడు. ఇక 2025లో జై హనుమాన్ ద్వారా తేజ ప్రేక్షకులకు మళ్లీ చేరువ కానున్నాడు. ఆ మూవీ కూడా హిట్ అయితే పాన్ ఇండియా లెవల్‌లో తేజ సజ్జా ఇంకా గొప్ప స్థాయికి ఎదగడం ఖాయమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.