Team India : మరి కొద్ది రోజులలో వెస్టిండీస్, అమెరికా వేదికగా టీమిండియా వరల్డ్ కప్ ఆడనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో ఆడే భారత జట్టుని కూడా అనౌన్స్ చేశారు. అయితే టీమ్ అనౌన్స్‌మెంట్ తర్వాత చాలా మంది ఆటగాళ్లు ఐపీఎల్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనబరచడం లేదు. 2024 సీజన్ ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించిన రోహిత్.. సెకండాఫ్‌లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. తొలి 7 ఇన్నింగ్స్‌ల్లో 297 పరుగులు చేసిన రోహిత్ తర్వాతి 5 ఇన్నింగ్స్‌ల్లో 34 పరుగులు మాత్రమే చేశాడు. వీటిని చూసిన ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఆందోళన వ్యక్తం చేశాడు. ఇది కరెక్ట్ కాదని, ఇది మంచి పరిణామం కాదని అన్నాడు. ఇక నిన్న జరిగిన మ్యాచ్‌లో జిడ్డు బ్యాటింగ్ చేశడు.
24 బంతులు ఆడి 19 పరుగులు మాత్రమే చేశాడు. కీలక టీ20 ప్రపంచకప్ ముందు రోహిత్ శర్మ చెత్తాట అభిమానుల్ని ఆందోళనకు గురి చేస్తుంది. ఇక, ముంబై ఇండియన్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంట అంతమంచింది. మనోడి ఈ సీజన్‌లో బ్యాటింగ్, బౌలింగ్, కెప్టెన్సీ ఇలా మూడు విభాగాల్లో దారుణంగా విఫలమై విమర్శల పాలయ్యాడు. అసలు హార్దిక్ పాండ్యాకు టీమిండియాలో చోటు కష్టమనుకుంటే ఏకంగా వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. అయితే, హార్దిక్ పాండ్యా వైఫల్యం కొనసాగుతున్నా అతడిని ఎందుకు జట్టులోకి తీసుకున్నారు అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

గల్లి క్రికెటర్ కన్నా దారుణంగా ఆడుతున్న హార్ధిక్ పాండ్యాని ఎందుకు తీసుకున్నారో వారికే తెలియాలి. టీమిండియాను ఆ దేవుడే కాపాడాలంటూ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. ఫామ్‌లో లేని రోహిత్, హార్దిక్, సిరాజ్, చాహల్ లాంటి ఆటగాళ్లతో టీమిండియా ప్రపంచకప్ నెగ్గడం కష్టమేనన్న టాక్ వినిపిస్తుంది. శివమ్ దూబేని వరల్డ్ కప్ లో సెలక్ట్ చేయకముందు బాగానే ఆడాడు. కాని ఎప్పుడైతే సెలక్ట్ చేశారో అప్పటి నుండి మనోడు కూడా చెత్త ఆట కొనసాగిస్తున్నాడు. వరల్డ్ కప్ ఆడే టీంలో చాలా మంది ఫామ్‌లో లేరు. మరి అలాంటి టీమ్‌తో ఇండియా ఎలా వరల్డ్ కప్ గెలుస్తుందో చూడాలి.