Team India : టీమిండియాని వరుస పరాజయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల టీ 20 వరల్డ్ కప్‌లో దారుణంగా ఆడి సెమీస్‌కి ఇంటి బాట పట్టిన ఇండియా న్యూజిలాండ్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో చెత్త ప్రదర్శన కనబరిచి సిరీస్ కోల్పోయింది. ఇక రీసెంట్‌గా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ను బంగ్లాదేశ్ చిత్తుచేసింది. ఆఖర్లో తీవ్ర ఉత్కంఠ నెలకొనగా.. బంగ్లా ఆల్‌రౌండర్ మెహీది హసన్ (38) చివరి వరకు క్రీజ్‌లో నిలబడి జట్టును గెలిపించాడు. ముస్తాఫిజూర్ రెహ్మాన్ (10)తో కలిసి ఆఖరి వికెట్‌కు అజేయంగా 54 పరుగులు జోడించి విజయ తీరాలకు చేర్చాడు.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 41.2 ఓవర్లలో కేవలం 186 పరుగులకే ఆలౌట్ అయింది. 187పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ఆ లక్ష్యాన్ని చేరుకొని తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 2022 టీమిండియాకి బ్యాడ్ ఇయర్ అనే చెప్పాలి. ఏడాది ప్రారంభంలో, ఇండియా జట్టు దక్షిణాఫ్రికాతో టెస్ట్ మరియు వన్డే మ్యాచ్‌లలో ఓడిపోయారు. ఇంగ్లండ్ జట్టు మంచి స్థితిలో లేనప్పటికీ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ను ఓడించలేకపోయారు భారత ఆటగాళ్లు. ఆసియా కప్‌లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచి ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.
విరాట్ కోహ్లి స్థానంలో బీసీసీఐ రోహిత్ శర్మను కెప్టెన్‌గా నియమించిన తర్వాత, టీం ఇండియా పేలవమైన క్రికెట్‌ని ఆడుతుంది., జట్టుకి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడంలో మరియు అందుబాటులో ఉన్న ప్రతిభను ఉపయోగించడంలో కెప్టెన్ అసమర్థతను ఎత్తిచూపింది. ఏడాది చివరి నెలలో వారు మరొ చెత్త ప్రదర్శన కనబరచి క్రికెట్ ప్రేమికులకి చేదు జ్ఞాపకం మిగిల్చారు. అయితే బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ విడిచిన సులవైన క్యాచ్‌తో ఊపిరి పీల్చుకున్న హసన్ ఫోర్లు, సిక్సర్లతో బంగ్లాను గెలిపించాడు. గతంలో కూడా ఇలాంటి తప్పులు చేసి భారీ మూల్యం చెల్లించుకున్నారు.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…