TDP Song : మధుప్రియ.. ఈ పేరు గురించి సంగీత ప్రియులకి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఫోక్ సాంగ్స్ పాడుతూ ప్రతి ఒక్కరిని ఎంతో ఉత్సాహపరుస్తుంటుంది. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనమ్మా అనే పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిన మధుప్రియ ఆ తర్వత తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలు పాడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో తాను ఒక భాగం అయింది. ఇప్పటికీ పలు సినిమా పాటలు పాడుతూ అలానే పార్టీల ప్రచారాల కోసం పాటలు పాడుతూ వస్తుంది. సాయిచంద్ అకాల మరణంతో ఆ స్థానంలో ఎవరు వస్తారనే ఆసక్తి ప్రజల్లో నెలకొని ఉంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సింగర్ మధుప్రియ ప్రత్యక్షమయ్యారు.
దాంతో సీఎం కేసీఆర్ సభతో పాటు బీఆర్ఎస్ సంబంధించిన అన్ని సభల్లో సింగర్ మధుప్రియ తన ఆట పాటతో అలరిస్తుందనే చర్చ నడుస్తుంది. రానున్న రోజుల్లో కూడా సింగర్ మధుప్రియ తన పాటలతో, మాటలతో ప్రజలను అలరించనుంది. కరీంనగర్ జిల్లా గోదావరిఖనికి చెందిన గాయకురాలు. ఎక్కువగా జానపద గేయాలు పాడుతూ వచ్చిన మధుప్రియ అప్పుడప్పుడు సినిమాల్లో పాటలు పాడింది. ఇక మధుప్రియ ఐదవ తరగతి చదువుతున్నప్పుడే ‘ఆడపిల్లనమ్మా’ అనే పాటతో మంచి గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే.
![TDP Song : సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మధుప్రియ పాట.. టీడీపీ గురించి భలే పాడిందిగా..! TDP Song by singer madhu priya viral on social media](http://3.0.182.119/wp-content/uploads/2023/08/tdp-song.jpg)
ఇటీవల జనసేన పార్టీ ప్రచార సాంగ్ కూడా పాడి అందరి మెప్పు పొందింది. ఆ సాంగ్ ఓ ఊపు ఊపేసింది. ఇక ఇప్పుడు టీడీపీ పార్టీ కోసం ఓ పాట పాడింది మధుప్రియ. ఎంతో ఉత్సాహంగా పాడిన ఈ పాట సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇందులో టీడీపీ పార్టీ అమలు పరచనున్నవి చక్కగా వివరించింది. అమ్మలారా.. అక్కలారా అంటూ ఈ పాట మొదలు కాగా ఇందులో బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అని కూడా ఉంది. ఈ పాట తెలుగు తమ్ముళ్లలో జోష్ బాగా పెంచింది. కాగా, మధుప్రియ ఫిదా సినిమాలో వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే అనే పాట పాడి గుర్తింపును మరింత పెంచుకుంది.
https://youtube.com/watch?v=i5e4MQ1tmVI