ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చిన యువతరం నటుడు, రాజకీయ నాయకుడు నందమూరి తారకరత్న శనివారం రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. నారా లోకేష్ యువగళంకి హాజరైన లోకేష్ జనవరి 27న గుండెపోటుకు గురై 23 రోజులుగా మృత్యువుతో పోరాడి కన్నుమూసారు. సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లోనే ఒకేరోజు 9 సినిమాలపై సంతకం పెట్టి ఒక్కసారిగా వార్తల్లోనిలిచిన తారకరత్న కెరీర్‌లో పెద్దగా విజయాలు సాధించలేకపోయారు. అనంతరం హీరో పాత్రల నుంచి తరువాత రోజుల్లో విలన్ పాత్రల్లోకి దిగారు. ఇటీవల తెలుగుదేశం పార్టీలో చురుగ్గా కనిపించి మళ్లీ వార్తల్లో నిలిచిన ఆయన ఇలా కన్నుమూయడం అందరిని బాధిస్తుంది.
నందమూరి మోహన కృష్ణ కుమారుడు అయితప తారకరత్న 1983 ఫిబ్రవరి 22న జన్మించారు. అలేఖ్య రెడ్డిని వివాహం చేసుకోగా, వారికి ఒక కుమార్తె ఉంది. అయితే సినీ పరిశ్రమకు చెందిన వారికి సెంటిమెంట్స్ అనేవి ఉండడం సహజం. అలా తారకరత్నకి ఓ నెంబర్ అస్సలు కలిసి రాలేదు. అదే నంబర్ 9. 2001లో తారకరత్న ఇండస్ట్రీకి అప్పుడే పరిచయం అవుతున్న సమయంలో ఒకేరోజు మొత్తం 9 సినిమాలకు సంతకం చేయగా, అన్ని సినిమాలు సంతకం చేసి వరల్డ్ రికార్డ్ సృష్టించిన ఘనత తారకరత్న పేరు మీద ఉంది.. అయితే వీటిలో 6 సినిమాలు షూటింగ్ కి నోచుకోలేదు.
మిగతా 3 సినిమాల్లో ఒకటి ఒకటో నెంబర్ కుర్రాడు, రెండవది యువరత్న కాగా మూడవది తారక్. తొమ్మిది సినిమాలు సైన్ చేస్తే ఆరు సినిమాలు ఆగిపోవడం తారకరత్నని కూడా బాధించింది. ఇక కుప్పం పర్యటనలో తారకరత్నకు గుండెపోటు వచ్చిన తేదీని కలిపితే 9 రావడం, మరణించిన తేదీని కలిపితే 9 రావడం చూస్తుంటే 9 అంకె కలిసి రాలేదేమో అని అభిమానులు చర్చలు జరుపుతున్నారు. తారకరత్నకి గత నెల 27న హార్ట్ స్ట్రోక్ రాగా, ఫిబ్రవరి 18న తుది శ్వాస విడిచారు. తారకరత్న ఇలా చిన్న వయసులోనే కాలం చెందడం జీర్ణించుకోలేని విషయం.
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…
గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…
ప్రస్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇంతకముందు మాదిరిగా కాకుండా మన సినిమాల కోసం…