Taraka Ratna : సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతో మంది అడుగుపెడతారు. కానీ కొంతమంది మాత్రమే స్టార్ హీరో స్టేటస్ ని సంపాదించుకొని ఇండస్ట్రీలో స్థిరపడతారు. మరికొందరు యాక్టింగ్ లో మంచి టాలెంట్ ఉన్నా కూడా కొన్ని చిత్రాలకే పరిమితమై అదృష్టం కలిసిరాక ఇండస్ట్రీకి దూరమవుతారు. ఇలా ఈ లిస్టులో ఉన్న వారిలో నందమూరివారి వారసుడు తారకరత్న. టాలీవుడ్ ను హీరోగా శాసించిన నందమూరి తారకరామారావు ఫ్యామిలీ నుండి తారకరత్న హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 2002లో ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న వెండితెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ ఆ తరవాత తారకతర్న కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. చివరికి అసలు థియేటర్ లోనే విడుదలకు నోచుకోని సినిమాల్లోనూ తారకరత్న నటించాల్సి వచ్చింది.
ప్రస్తుతం తారకరత్నకు మంచి రోజులు వచ్చినట్టు కనిపిస్తున్నాయి. మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించే అవకాశం తారకరత్నకు దక్కినట్టుగా టాక్ వినిపిస్తుంది. కొన్ని నెలల క్రితం డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అయినా నైన్ అవర్స్ లో సి.ఐ ప్రతాప్ పాత్రలో కనిపించాడు తారకరత్న. అయితే విషయాలని ఇలా ఉండగా తారకరత్న ఎంతో కష్టపడినప్పటికీ ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వకపోవడానికి కొన్నికారణాలు ఉన్నాయంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
![Taraka Ratna : ఈ 5 కారణాల వల్లే తారకరత్న సినిమా కెరీర్ నాశనం అయిందా..? Taraka Ratna movie career is failed because of these 5 reasons](http://3.0.182.119/wp-content/uploads/2022/11/taraka-ratna.jpg)
ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన తారకరత్న బక్కపలుచగా కనిపించాడు. కాబట్టి మొదటి చిత్రంతోనే అతడి ఎంట్రీ లుక్ కాస్త నందమూరి అభిమానులను నిరాశపర్చడంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోయాడు. మొదటిసినిమా కోదండరామిరెడ్డి లాంటి స్టార్ డైరెక్టర్ తో చేయగా ఆ తరవాత సినిమాలన్నీ కొత్త దర్శకులతో చేయడం కూడా తారకరత్న సినీ కెరీర్ కి మైనస్ పాయింట్ అయ్యిందట. అంతే కాకుండా నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ కూడా తారకరత్నకు బహిరంగంగా ఎక్కడా కనిపించకపోవడం వల్ల కూడా తారకరత్నకు మరో మైనస్ అయ్యింది. ఇక తారకరత్న ఓ అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో తారకరత్నను దూరం పెట్టడం వల్ల కూడా అతడి కెరీర్ పై ప్రభావం చూపి ఉండవచ్చు అని సినీ విశేషకులు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు.