Tammareddy Bharadwaj : తెలుగు సినిమా చరిత్రలో మెగాస్టార్ చిరంజీవిది అలుపెరగని ప్రస్థానం అన్న సంగతి మనందరికి తెలిసిందే. ఆనాటి నుంచి నేటితరం వరకు అన్ని వర్గాల ఆడియన్స్ మెప్పు పొందుతున్నారు చిరు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా ఎంతో మంది ప్రేక్షకాదరణ పొందారు ఆయన. ఖైదీ నంబర్ 150 చిత్రంతో సినిమాల్లోకి రీ- ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు చిరంజీవి. అయితే ఈ మధ్యకాలంలో చిరంజీవి సినిమాల్లో మరో హీరో కూడా భాగం అవుతుండటం చూస్తున్నాం. ఇదే అంశంపై సీనియర్ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
సోషల్ మీడియాలో చిరంజీవిపై రకరకాల కామెంట్స్ వస్తున్నాయని, ఆయన మార్కెట్ తగ్గిపోయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారని చెప్పిన తమ్మారెడ్డి.. చిరుకు తోకలు, ఆయన్ని ఎత్తడానికి జాకీలు అవసరం లేదంటూ కాస్త గట్టిగానే చెప్పారు. చిరు మార్కెట్‌కి ఎటువంటి డోకా లేదన్నట్లుగా ఆయన తెలియజేశారు. అయితే నాగబాబు ఇటీవల ఓ ఈవెంట్‌లో మాట్లాడుతూ ఎవరో చిరంజీవి గారికి రెడ్ కార్పెట్ పరిచారని, ఆ తర్వాత తక్కువగా మాట్లాడారని అన్నారు కానీ.. తనకు తెలిసి చిరంజీవి అలాంటివి పెద్దగా పట్టించుకోరని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.
![Tammareddy Bharadwaj : నాగబాబు మాట్లాడకపోతే చాలా మంచిది.. చిరంజీవిని జాకీలతో లేపాల్సిన పనిలేదన్న తమ్మారెడ్డి.. Tammareddy Bharadwaj said nagababu should not talk much](http://3.0.182.119/wp-content/uploads/2022/12/tammareddy-bharadwaj.jpg)
మనం అలాంటివి పట్టించుకుంటే ఎదుటివారి స్థాయిని పెంచి చిరు స్థాయి తగ్గించినట్లు అవుతుందని చెప్పిన తమ్మారెడ్డి.. నాగబాబు గారు అలాంటి విషయాలను మాట్లాడకపోతే చిరంజీవి గారి గౌరవం ఇంకా పెరుగుతుందని చెప్పుకొచ్చారు. నాకు తెలిసి 1 నుంచి 10 వరకు చిరంజీవిగారే. పాత రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణ, శోభన్‌బాబు కూడా లీన్ టైమ్ చూశారు. మళ్లీ వాళ్ల దార్లోకి వచ్చారు. అందరికీ ఓ పీరియడ్ వస్తుంది. ఇక్కడ ఎవరి స్థానం వాళ్లకి ఉంటుంది. ఎవరి స్థాయి వారిది. చిరంజీవిగారిని ఎవరో వచ్చి జాకీ పెట్టి లేపాల్సినంత అవసరం లేదు. ఆయన ఫాలోయింగ్, క్రేజ్ రెవెన్యూ ఎక్కడికి పోలేదు అని తమ్మారెడ్డి తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చారు.