Talasani : బీఆర్ఎస్ యంగ్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కారు డ్రైవర్, ఎమ్మెల్యే పీఏ ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మరోవైపు.. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మొదట ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు ప్రమాదంపై ప్రాథమిక దర్యాప్తు చేయగా కేవలం రెయిలింగ్‌ను ఢీకొనడం వల్లే ఇంత ఘోర ప్రమాదం జరగలేదన్న అంచనాకు వచ్చారు. దీనిపై ఇంకా లోతుగా దర్యాప్తు జరుగుతోంది. ప్రమాద స్థలంలో ప్రాథమిక దర్యాప్తు తర్వాత ఎమ్మెల్యే కారు డ్రైవర్‌ను పోలీసులు పలు విషయాలపై ప్రశ్నలు సంధించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అయితే.. ‘ప్రమాదం ఎలా జరిగిందో నాకు తెలియదు.. నాకు అసలు గుర్తే లేదు’ అని డ్రైవర్ చెబుతున్నాడని పోలీసులు మీడియాకు వెల్లడించారు.
ఇవే కాదు ఎన్ని సార్లు అడిగినా.. ఎన్ని ప్రశ్నలు సంధించినా పదే పదే తెలియదనే విషయాన్నే చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం డ్రైవర్‌కు ట్రీట్మెంట్ జరుగుతుండగా.. సాయంత్రం, రేపు ఉదయం మరోసారి విచారించాలని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. ఈ మొత్తం వ్యవహారాన్ని బట్టి చూస్తే.. డ్రైవర్ నిద్రమత్తే అతివేగానికి కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమిక అంచనా వచ్చినట్లు తెలియవచ్చింది. అయితే పోస్టుమార్టం నిమిత్తం ఆమె పార్దీవ దేహాన్ని గాంధీ హాస్పిటల్ కు తీసుకొస్తున్న విషయం తెలుసుకొని ఆయన గాంధీ హాస్పిటల్‌కు చేరుకున్నారు. అక్కడ లాస్య తల్లి, సోదరి లను ఓదార్చి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లాస్య తండ్రి సాయన్న కూడా కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పాటు ప్రాతినిద్యం వహించారని వివరించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకొని ఆమె పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్.
రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధాకరమని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత మరణించిన విషయం తెలుసుకున్న ఆయన తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. లాస్య తండ్రి సాయన్న కూడా కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పాటు ప్రాతినిద్యం వహించారని వివరించారు. పోస్టుమార్టం అనంతరం కార్ఖానాలోని లాస్య నందిత నివాసానికి చేరుకొని ఆమె పార్దీవ దేహానికి నివాళులు అర్పించారు.