Blood Circulation : శరీరంలో ఎర్ర రక్తకణాలు ఎంతో ముఖ్యమైనవి. ఇవి శరీరంలోని అవయవాలకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తాయి. ఈ ఎర్ర రక్తకణాలు ఎముకలలో ఉండే మూలుగులలో తయారు చేయబడతాయి. ఈ ఎర్రరక్త కణాల జీవిత కాలం 120 మాత్రమే. ఈ కణాలు క్షీణ దశకు వచ్చిన తరువాత మళ్ళీ ఎముకల్లో మూలుగులు వాటిని వృద్ది చెందిస్తాయి. సుమారు ఒక సెకనుకి 20 నుంచి 30 లక్షల కణాలు వృద్ది చెందుతాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియ సజావుగా సాగినంత వరకూ బాగానే ఉంటుదని కానీ ఎప్పుడైతే ఎర్రరక్త కణాల ప్రభావం తగ్గుతూ వస్తుందో అప్పుడు ప్రమాదంలో మనం పడినట్టే.
అయితే ఎర్ర రక్తకణాలు వృద్ది చెందటానికి కొన్ని ఆహార పదార్థాలు తినడం వలన ఎర్ర రక్తకణాలు పెరగడమే కాకుండా పూర్తిగా ఆరోగ్యాన్ని అందిస్తాయి. అవేంటో చూద్దాం.. బీట్ రూట్: బీట్ రూట్ లో ఐరన్, ప్రొటీన్ సమృద్ధిగా ఉండుట వలన రక్తాన్ని శుద్ధి చేయటమే కాకుండా రక్తంలో రక్త కణాల సంఖ్యను పెంచుతుంది. అంతేకాక బీట్ రూట్ ఆకులలో విటమిన్ ఏ, సి అధికంగా ఉండుట వలన రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. పచ్చని ఆకుకూరలు: తోటకూర, గోంగూర, బచ్చలి కూర, బ్రకోలి వంటి ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
![Blood Circulation : వీటిని తింటే రక్తం పెరగడమే కాదు.. రక్త సరఫరా కూడా మెరుగు పడుతుంది.. take these foods to increase Blood Circulation](http://3.0.182.119/wp-content/uploads/2022/11/blood-circulation.jpg)
అందువల్ల వాటిని ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకుంటే రక్తంలో రక్తకణాల సంఖ్య పెరగటమే కాకుండా బరువు కూడా తగ్గుతారు. ఐరన్: శరీరానికి ఐరన్ చాలా అవసరం. ఎముకలను గట్టిపరచటమే కాకుండా ఆక్సిజన్ సరఫరాలో బాగా సహాయపడుతుంది. ఐరన్ లోపం కారణంగా రక్తహీనత సమస్య వస్తుంది. మెంతులు, ఖార్జురం, బాదం, బంగాళదుంప వంటి వాటిని రెగ్యులర్ గా తింటూ ఉండాలి. బాదంపప్పులు: ఐరన్ పుష్కలంగా వుంటుంది. ప్రతిరోజూ ఒక ఔన్సు తీసుకుంటే రోజులో అవసరమైన 6 శాతం ఐరన్ ఇస్తుంది.