SV Krishna Reddy : ఆమ‌నితో సినిమా చేయాల‌ని అనుకున్నా.. కాని ఆమె నాకు మాములు హ్యాండ్ ఇవ్వ‌లేదు..!

SV Krishna Reddy : కథా బలంతో పాటు వైవిధ్యం ఉన్న సినిమాలు చేస్తూ అల‌రిస్తున్న ద‌ర్శ‌కుడు కృష్ణారెడ్డి. ఆయన అప్పట్లో శుభలగ్నం, మావిచిగురు, యమలీల లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. కానీ బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోలతో ఆయన చేసిన టాప్ హీరో.. వజ్రం చిత్రాలు దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. తాను కథని నమ్ముకున్నప్పుడు ఎప్పుడూ ఫ్లాప్ కాలేదని.. హీరోల ఇమేజ్ కి తగ్గట్లుగా సినిమా చేయాలనుకున్నప్పుడు దెబ్బైపోయానని అన్నారు. హీరోకి తగ్గట్లుగా ఎప్పుడూ సినిమా చేయకూడదు. కథని కథలాగే తీయాలి. యమలీల చిత్రంలో నేను కథ గురించే ఆలోచించా ఇంకేమి పట్టించుకోలేదు అని ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.

హీరోయిన్స్‌కి ఎక్కువ మైలేజ్ ఇవ్వ‌డంలో ఎస్వీ కృష్ణారెడ్డి రూటు స‌ప‌రేట్. ఆయ‌న ఆమ‌నితో చాలా చిత్రాలు చేశారు. ఓ ఇంట‌ర్వ్యూలో ఆమ‌నిని బాగా ఆకాశానికి ఎత్తేశారు. ఆమ‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి పాత్ర‌లో చాలా బాగా న‌టిస్తుంది. ఏ పాత్ర‌లోనైన అలా జీవిస్తుంది. ఆమ‌ని చేసిన సినిమాలు చాలా హిట్ అవుతాయి. అయితే ఓ సారి ఆమ‌నితో సినిమా చేయాల‌ని అనుకున్నా కాని ఆమె నో చెప్పింది. కార‌ణం ఏంటంటే ఆమె పెళ్లి ఉంద‌ని ఏదో కార‌ణం చెప్పింది. దాంతో చేసేదేం లేక డ్రాప్ అయ్యాను. మ‌ళ్లీ సినిమా చేయ‌లేద‌ని కృష్ణారెడ్డి అన్నారు. జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో నటించిన శుభ‌లగ్నంలో జగపతి బాబు అమాయకపు నటన తో మెప్పిస్తే ..అత్యాశలకు పోయి భర్తను కోటి రూపాయలకు అమ్మేసిన భార్యగా ఆమని పర్ ఫామెన్స్ ఇరగదీసింది. కానీ ఆతర్వాత తన తప్పును తెలుసుకుని డబ్బుకున్న మొగుడే ముఖ్యం అంటూ కన్నీటి పర్యంతమైన పాత్రలో ఆమని తమ నట విశ్వరూపం ప్రదర్శించింది.

SV Krishna Reddy interesting comments on amani
SV Krishna Reddy

మిడిల్ క్లాస్ భర్తగా వచ్చిన దాంట్లోనే సర్దుకు పోయే జగపతి బాబు, డబ్బే ముఖ్యం అనుకుంటూ అత్యాశలకుపోయి భర్తనే అమ్మేసుకున్న భార్య గా ఆమని.. కోటి రూపాయలకు కొనుక్కున్నప్పటికీ అన్ని విషయాల్లో భర్తకు అండగా ఉండే పాత్రలో రోజా అదరగొట్టేసారు. అప్పట్లో దర్శకులుందరూ మంచి ప్రేమకథలు తీస్తుంటే కృష్ణారెడ్డి మాత్రం విడాకుల గురించి సినిమాలు తీశారు.అయితే ప్రేమ కథలు, మంచి ఫ్యామిలీ డ్రామాల కంటే ఈ విడాకుల కథలే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. సన్సేషనల్ హిట్ గా నిలిచిన కుటుంబ కథా చిత్రం శుభలగ్నం ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం లో తెరకెక్కిన ఉత్తమ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago