SV Krishna Reddy : కొందరు సెలబ్రిటీలకు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. సినిమాకి పని చేసిన వారికి ఏదో ఒకటి బహుమతిగా ఇవ్వడం కామన్. ఒకప్పుడు అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించిన ఎస్వీ కృష్ణారెడ్డి షూటింగ్ సమయంలో కూడా హీరోయిన్ లను ఎంతో పద్దతిగా చూసుకుంటారని చెబుతుంటారు. సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత కూడా హీరోయిన్ లకు డబ్బులతోపాటు వెండి పళ్లెంలో పట్టుచీరలు పెట్టి సన్మానం చేసేవారని చెబుతుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అని అడగ్గా, అది తన అమ్మ నుండి నేర్చుకున్నానని అంటుంటాడు.
నా తల్లి, భార్య, కూతుళ్లు కూడా ఆడవాళ్లే కాబట్టి వారిని గౌరవిస్తాను అంటూ కృష్ణారెడ్డి అంటుంటారు. తన సినిమాలలో కూడా అశ్లీలత ఉండదని అలా వినోదాన్ని పంచకుండా కామెడీతో ముందుకు తీసుకెళతానని కృష్ణా రెడ్డి చెబుతుంటారు. ఎస్వీ కృష్ణారెడ్డి.. చిన్న చిన్న సినిమాలు, కుటుంబ సమేతంగా చూడగలిగే సినిమాలు, మధ్యతరగతి విలువలు, బాధల్ని చెప్పే సినిమాలు తీస్తూ ఎన్నో విజయాలు అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, అభిషేకం, యమలీల, శుభలగ్నం, మావి చిగురు, పెళ్ళాం ఊరెళితే, ఘటోత్కచుడు, యమలీల, ఎగిరే పావురమా.. లాంటి చిత్రాలు ఎంతో సూపర్ హిట్ లను సాధించాయి.
కేవలం డైరెక్టర్ గానే కాక తన సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా, నటుడిగా, రచయితగా కూడా పని చేశారు. చివరిసారిగా 2014లో యమలీల 2 తీశారు. అయితే ఆ సినిమా ఆశించినంత విజయం సాధించలేదు. అయితే దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా సినిమాని తీస్తున్నారు. ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు అనే టైటిల్ తో కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని తెరకెక్కించనున్నారు. ఇందులో రాజేంద్రప్రసాద్, సునీల్, వరుణ్ సందేశ్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ సతీమణి కల్పన నిర్మిస్తున్నారు.