Surya : విజ‌య్ కాంత్ మృతిపై ఫుల్ ఎమోష‌న‌ల్ అయిన సూర్య‌..!

Surya : ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ గురువారం ఉదయం కన్నుమూసిన విష‌యం తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించింది. కరోనా కూడా సోకడంతో.. వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందించిన ఫ‌లితం లేక‌పోయింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పోరాడుతూ 71 ఏళ్ల వయసులోనూ ఆయన తుదిశ్వాస విడిచారు. సినీ నటుడిగానే కాకుండా, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు కజగం) పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు.

తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లాంటి బలమైన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. కరుణానిధి, జయలలిత లాంటి బలమైన నేతలు ఉన్నప్పటికీ.. విజయ్ కాంత్ డీఎండీకేతో ధైర్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకేతో విజయ్ కాంత్ పార్టీ పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది. 41 సీట్లలో పోటీ చేసిన డీఎండీకే 29 స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కరుణానిధి పార్టీ డీఎంకే కంటే.. విజయ్ కాంత్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. ఎన్నికల తర్వాత జయలలితతో విబేధాల కారణంగా.. విజయ్ కాంత్ అన్నాడీఎంకేకు దూరమయ్యాడు. దీంతో ప్రతిపక్ష నేతగా ఆయన గుర్తింపు పొందారు.

Surya emotional about vijaykanth death
Surya

విజయ్ కాంత్ గురించి తమిళ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి స్టార్ హీరోలు ఆరా తీస్తున్నారు. విజయ్ కాంత్ భార్యకు ఫోన్ చేసి.. ధైర్యం చెపుతున్నారు. తాజాగా విజయ్ కాంత్ అనారోగ్యంపై తమిళ స్టార్ హీరో సూర్య స్పందించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమణికి ఫోన్ చేసి విజయ్ కాంత్ ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు సూర్య. అలాగే సోషల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ షేర్ చేశాడు. అన్న విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుంటారు అని రాసుకొచ్చారు సూర్య. అత‌ని మృతి ప్ర‌తి ఒక్క‌రికి తీర‌ని లోటు అని సూర్య అన్నారు.

Share
Shreyan Ch

Recent Posts

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

18 hours ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 days ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 days ago

జ‌గ‌న్ రాష్ట్రాన్ని భ్ర‌ష్టు ప‌ట్టించారు: నాదెండ్ల మనోహ‌ర్

జ‌గ‌న్ పాల‌న‌పై ఇప్ప‌టికీ విమ‌ర్శ‌ల వ‌ర్షం గుప్పిస్తూనే ఉన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కులు అయితే జ‌గన్ బాగోతాల‌ని ఒక్కొక్క‌టిగా…

3 days ago

పోర్ట్ బ్లెయిర్ మార్పుపై స్పందించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. స్వాగ‌తిస్తున్నానంటూ కామెంట్..

బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌లు నిర్ణ‌యాలు తీసుకోవ‌డ‌మే కాక వాటిని అమ‌లు చేస్తూ వ‌స్తుంది.బ్రిటీష్ వలస పాలన నాటి…

3 days ago

దేవ‌ర సినిమా చూసి చ‌నిపోతా.. అప్ప‌టి వ‌ర‌కు న‌న్ను బ్ర‌తికించండి అని ఎన్టీఆర్ ఫ్యాన్ రిక్వెస్ట్

క్యాన్సర్ బారిన పడి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న ఒక యువకుడు తనను బ్రతికించాలంటూ ప్రాధేయ‌ప‌డ్డాడు. అయితే అంత‌క‌ముందు ఎన్టీఆర్ న‌టించిన…

3 days ago

Danam Nagender : కౌశిక్ రెడ్డి స‌త్తా ఏంటో మాకు తెలుసు.. దానం నాగేందర్ స్ట్రాంగ్ కౌంట‌ర్..

Danam Nagender : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ వాదాన్ని తెరపైకి తీసుకురావ‌డంతో ఇప్పుడు ఈ విష‌యం…

4 days ago

కీల‌క నిర్ణ‌యం తీసుకున్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌..!

ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణ‌యాల‌తో వార్త‌ల‌లో నిలుస్తున్నారు. తాజాగా మరో కీలక నిర్ణయం…

5 days ago