Surya : ప్రముఖ తమిళ నటుడు విజయ్ కాంత్ గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన ఆరోగ్యం ఇటీవల విషమించింది. కరోనా కూడా సోకడంతో.. వెంటిలేటర్ మీద ఉంచి ఆయనకు చికిత్స అందించిన ఫలితం లేకపోయింది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో పోరాడుతూ 71 ఏళ్ల వయసులోనూ ఆయన తుదిశ్వాస విడిచారు. సినీ నటుడిగానే కాకుండా, డీఎండీకే (దేశీయ ముర్పోక్కు కజగం) పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి.. రాజకీయాల్లోనూ ఆయన రాణించారు.
తమిళనాడులో డీఎంకే, అన్నాడీఎంకే లాంటి బలమైన రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ.. కరుణానిధి, జయలలిత లాంటి బలమైన నేతలు ఉన్నప్పటికీ.. విజయ్ కాంత్ డీఎండీకేతో ధైర్యంగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత నాయకత్వంలోని అన్నాడీఎంకేతో విజయ్ కాంత్ పార్టీ పొత్తు పెట్టుకొని బరిలోకి దిగింది. 41 సీట్లలో పోటీ చేసిన డీఎండీకే 29 స్థానాల్లో విజయం సాధించింది. అప్పటి వరకూ అధికారంలో ఉన్న కరుణానిధి పార్టీ డీఎంకే కంటే.. విజయ్ కాంత్ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం గమనార్హం. ఎన్నికల తర్వాత జయలలితతో విబేధాల కారణంగా.. విజయ్ కాంత్ అన్నాడీఎంకేకు దూరమయ్యాడు. దీంతో ప్రతిపక్ష నేతగా ఆయన గుర్తింపు పొందారు.
విజయ్ కాంత్ గురించి తమిళ సెలబ్రిటీలు వరుసగా స్పందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం గురించి స్టార్ హీరోలు ఆరా తీస్తున్నారు. విజయ్ కాంత్ భార్యకు ఫోన్ చేసి.. ధైర్యం చెపుతున్నారు. తాజాగా విజయ్ కాంత్ అనారోగ్యంపై తమిళ స్టార్ హీరో సూర్య స్పందించారు. విజయ్ కాంత్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబసభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన సతీమణికి ఫోన్ చేసి విజయ్ కాంత్ ఆరోగ్య విషయాలను తెలుసుకున్నారు సూర్య. అలాగే సోషల్ మీడియాలో సూర్య ఓ పోస్ట్ షేర్ చేశాడు. అన్న విజయకాంత్ కోలుకోవాలని ప్రార్థించే కోట్లాది హృదయాల్లో నేనూ ఒకడిని. కోట్లాది మంది ప్రజల ప్రార్థనలు తప్పకుండా నెరవేరుతాయి. ఆయన పూర్తిగా కోలుకుంటారు అని రాసుకొచ్చారు సూర్య. అతని మృతి ప్రతి ఒక్కరికి తీరని లోటు అని సూర్య అన్నారు.