Surekha Vani : క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది సురేఖా వాణి. సురేఖా వాణి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా వుంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.తన కూతురు సుప్రీత తో కలిసి డాన్స్ లు చేస్తూ ఈ వయసులో కూడా తన అందాన్ని ఆరబోస్తూ నెటిజన్స్‌కి పసందైన వినోదం పంచుతుంది. అయితే కొన్నేళ్ల క్రితం సురేఖా వాణి భర్త చనిపోగా, ఆ క్షణాలని తలచుకున్నప్పుడల్లా బాధపడుతూ ఉంటుంది. తాజాగా తన పుట్టిన రోజు సందర్భంగా భర్తను తల్చుకొని ఎమోషనల్ పోస్ట్ ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది సురేఖా వాణీ.
‘నా కళ్లలో ఆనందం, సంతోషం కన్నా.. నువు నా పక్కన లేవు అన్న బాధ నన్ను మరింత ఆందోళనకి గురి చేస్తుంది. నీ ప్రేమ, ఆశీర్వాదం నాకు తప్పక ఉంటాయి. నా ప్రతి పుట్టిన రోజుకి నువ్వు చేసే సందడి.. ఆ మధుర క్షణాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.నిన్న చాలా మిస్ అవుతున్నా.. లవ్ యూ ఫర్ ఎవర్ అంటూ తన సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్‌గా కామెంట్ పెట్టింది. ప్రస్తుతం సురేఖా వాణి పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది. కాగా, సురేష్ తేజ 2019 లో అనారోగ్యంతో ఆయన కన్నుమూశాడు. ఆయన కూడా మీడియా రంగంలోనే పని చేసి మంచి పేరు ప్రఖ్యతలు తెచ్చుకున్నారు.
ఓ సారి తన భర్త ఎలా చనిపోయాడనే విషయాన్ని సురేఖా వాణి ఓ ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆయన చనిపోవడానికి పదేళ్ల ముందు నుంచి షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. తర్వాత నాలుగైదేళ్లకు రక్తం గడ్డ కట్టేయటం ప్రారంభమైంది. ఆ క్లాట్స్ ఎక్కడ అవుతుందనేది ఎవరికీ తెలియదు. ఊపిరితిత్తుల్లో కావచ్చు. బ్రెయిన్‌లోనూ బ్లడ్ క్లాట్ కావచ్చు. తనకు లంగ్స్, బ్రెయిన్‌లో క్లాట్ అయినప్పుడు ట్రీట్‌మెంట్ చేస్తే సర్దుకుంది. కానీ ఓసారి కాలిలో బ్లడ్ క్లాట్ కావడంతో కాళి వేళ్లు తీయాల్సి వచ్చింది. వేళ్లు తీసేసిన ఒక నెల రోజుల్లో చనిపోయారు అంటూ చాలా ఎమోషనల్‌గా ఈ విషయాలు ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది సురేఖా వాణి.