Suhasini : తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ సుహాసిని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు అప్పటి స్టార్ హీరోలు అందరితో సుహాసిని నటించి మెప్పించారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంటకేశ్ లాంటి బడా హీరోలందరితోనూ నటించి, మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం పలు సినిమాల్లో సహాయనటి పాత్రలో ఆమె నటిస్తున్నారు. సెలెక్టివ్‌గా చిత్రాల్లో నటిస్తున్నారు. మణిరత్నంని వివాహం చేసుకున్న తర్వాత ఆమె ఎక్కువగా ఫ్యామిలీకే సమయం కేటాయిస్తుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలని షేర్ చేస్తూ ఉంటుంది.
మణిరత్నం , సుహాసినిలకి కొడుకు ఉండగా, ఆ కొడుక్కి అబ్బాయి జన్మించగా ఆ బుడతడితో సరదాగా డ్యాన్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం సుహాసిని ఇంగ్లండ్ లో ఉండగా, అక్కడ మనవడితో కలిసి చేస్తున్న సందడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇక ఆ మధ్య సుహాసిని బర్త్ డే జరుపుకోగా, ఆ వేడుకలో హీరోయిన్లంతా సుహాసినితో కలిసి డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట హల్చల్ చేశాయి. 1980,90లలో ఆమె తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు.
అయితే హీరోయిన్గా చేసినప్పుడు తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితుల గురించి తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడారు. కొన్ని అసభ్యకరమైన సన్నివేశాల్లో నటించాల్సి వస్తే.. సున్నితంగా తిరస్కరించేదాన్ని అని తెలిపారు. ఓ సినిమాలో హీరో ఒడిలో కూర్చునే సన్నివేశం ఉందని.. అది చేయాలని డైరెక్టర్ చెబితే.. తాను నో చెప్పానన్నారు. పరాయి వ్యక్తి ఒడిలో కూర్చోవడం తప్పు కాబట్టి తాను ఆ సీన్ చేయనని గట్టిగా వాధించాన్నారు. మరో సీన్లో హీరో ఐస్ క్రీమ్ తింటూ నాకు తినిపించాలి. హీరో ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ తినమనటం నాకు నచ్చలేదు. వేరే వాళ్లు ఎంగిలి చేసిన ఐస్ క్రీమ్ నేను ఎలా తింటాను.. నాకు వేరే ఐస్‌క్రీమ్ తీసుకురండి అన్నాను. అలా కాకపోతే సీన్ అయినా మార్చమని చెప్పాను అని సుహాసిని స్పష్టం చేశారు. తన స్నేహితురాలు నటి శోభనకు కూడా ఓ సమయంలో ఇలాంటి పరిస్థితే ఎదురైందని సుహాసిని చెప్పారు. శోభన నటించిన ఓ సినిమాలో ఇలాంటి సీన్‌నే పెట్టారని.. ఆ సీన్ నచ్చకపోవడంతో ఆమె చేయనని చెప్పిందన్నారు.