Sudeepa : చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్‌ను ఆరంభించిన సుదీప.. ఎన్నో సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసింది. ముఖ్యంగా నువ్వు నాకు నచ్చావ్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో పింకీ పాత్ర చేసి తెగ ఫేమస్ అయింది. ఇక అప్పటి నుండి పలు సినిమా ఆఫర్సే కాకుండా బుల్లితెర ఆఫర్స్ కూడా అంది పుచ్చుకుంది. ఇక తాజాగా బిగ్ బాస్ 6వ సీజన్‌లో రెండో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి వార్తలలో నిలిచింది. అయితే సుదీపని తన పర్సనల్ లైఫ్ గురించి నాగార్జున ప్రశ్నించగా ఆమె ఆసక్తికర సమాధానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరచింది.
సుదీప తన పేరెంట్స్ వలన చాలా ఇబ్బందులు పడ్డట్టు చెప్పుకు రాగా, నాలుగేళ్ల పాటు నరకం చూశానని కూడా పేర్కొంది. అందుకు కారణం ఆమె ప్రేమ వివాహం. సుదీప.. శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ప్రేమించి పెళ్లి చేసుకోగా, వాళ్ల ఇంట్లో ఆ ప్రేమను ఒప్పించడానికి నాలుగేళ్లు పట్టిందట. నిజానికి శ్రీ రంగనాథుని పెళ్లి చేసుకోవడం వాళ్లకి ఇష్టం లేదట. దీంతో ఆమెను వేరే పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేశారట. ఏదో సంబంధం తీసుకు వచ్చి నాకు నరకం చూపించారని పేర్కొంది. ఆ బాధతో నేను మూడు నాలుగు రోజులు అన్నం తినకుండా కూడా ఉన్నానని.. ఆ సమయంలో నరకం కూడా చూశానంది సుదీప.
తెరపై ఎప్పుడు హ్యాపీగా కనిపించే పింకీ జీవితంలో ఇన్ని బాధలు ఉన్నాయా అంటూ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సుదీప ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో పెద్దగా సందడి చేస్తున్నట్టు కనిపించడం లేదు. సైలెంట్‌గా ఉన్న ఈ అమ్మడు ఇంకా గేమ్ మొదలు పెట్టలేదు. అందరితో కలివిడిగానే ఉంటుంది. బిగ్ బాస్ టైటిల్ గెలవాలనేది ఈమె కల కాగా, దాని కోసం ఆమె తనవంతు ప్రయత్నం చేస్తుంది.