Srikanth Daughter Medha : టాలీవుడ్ మోస్ట్ లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్-ఊహ 1994లో విడుదలైన ‘ఆమె’ మూవీలో కలిసి నటించారు. దర్శకుడు ఇవివి సత్యనారాయణ ట్ తెరకెక్కించిన ఆమె బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఆమె సినిమా సెట్స్ లోనే వారి ప్రేమకు పునాది పడింది. చాలా కాలం ఈ జంట రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆమె తర్వాత ఊహ వరుసగా తెలుగులో చిత్రాలు చేశారు. టైర్ టు హీరోల చిత్రాల్లో హీరోయిన్ గా చేసిన ఊహ కొన్ని లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించారు. 1997లో శ్రీకాంత్-ఊహ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్ళికి పరిశ్రమకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. 25 ఏళ్లుగా శ్రీకాంత్-ఊహ కలిసి కాపురం చేస్తున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఇప్పటికే హీరోగా పరిశ్రమకు పరిచయమయ్యారు. నిర్మల కాన్వెంట్, పెళ్ళిసందD చిత్రాల్లో రోషన్ హీరోగా నటించాడు.
కొన్నాళ్లుగా శ్రీకాంత్ తో ఊహకు విబేధాలు తలెత్తుతున్నాయట. ఆర్థికపరమైన ఇబ్బందులు వీరి మధ్య గొడవలకు కారణమయ్యాయని, మనస్పర్థలు తారాస్థాయికి చేరడంతో విడాకులు తీసుకొని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని ప్రచారాలు సాగాయి. వీటిపై స్పందించిన శ్రీకాంత్ అవన్నీ అవాస్తవాలు అని ఖండించింది. ఇలా తప్పుడు ప్రచారాలు చేయడం చాలా బాధగా ఉందని శ్రీకాంత్ అన్నాడు.ఇక శ్రీకాంత్,ఊహా దంపతులకి ముగ్గురు సంతానం కాగా ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి. అమ్మాయి మేధ అందంలో అమ్మా నాన్నలకు మించి ఉంది. చక్కని రూపం, తేనే కళ్ళతో చూడగానే కట్టిపడేసే గ్లామర్ మేధ సొంతం. తాజాగా మేధ కుటుంబ సభ్యులతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు.
ఆలయ ప్రాంగణంలో తల్లి ఊహతో కలిసి కనిపించారు. చీరలో మేధ సాంప్రదాయబద్దంగా దర్శనమిచ్చారు. ఆమె కట్టు బొట్టు చూస్తే అచ్చ తెలుగు ఆడపిల్లను గుర్తు చేశారు. మేధ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. హీరోయిన్ గా ఎంట్రీకి సిద్దమే అన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే మేధ చదువు ఇటీవలే పూర్తి చేసినట్లు సమాచారం. చూస్తుంటే రానున్న రోజులలో మేధ వెండితెరపై సందడి చేయడం ఖాయంగా కనిపిస్తుంది. చూడాలి మరి దీనిపై శ్రీకాంత్ ఎప్పుడు క్లారిటీ ఇస్తాడో. ఇక ఇదిలా ఉంటే కెరీర్ పరంగా శ్రీకాంత్ ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. హీరోగా ఫేడ్ అవుటైన శ్రీకాంత్ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నిలదొక్కుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్ విలన్ రోల్ చేసిన అఖండ మంచి విజయం సాధించింది. అయినప్పటికీ ఆయనకు చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్స్ రావడం లేదు. ఇక కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టాలని తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…