Sri Reddy : సినీనటి కాకపోయినా సెలబ్రెటీ స్టేటస్ దక్కించుకుంది శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం సమయంలో ఆమె పేరు తెగ హాట్ టాపిక్ అయింది.. తెలుగు చిత్ర సీమలోని పెద్ద పెద్ద స్టార్లపై మీడియాకెక్కి, నానాయాగీ చేసింది శ్రీరెడ్డి. పరుష పదజాలంతో , వాడి వేడి విమర్శలు చేసే ఆమెకు అప్పట్లో ఫాలోవర్లు కూడా బాగా పెరిగారు. తెలుగు అమ్మాయిని కావడం వల్లే తనకు ఛాన్స్‌లు ఇవ్వడం లేదని, తెలుగు అమ్మాయిలను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని , కోరిక తీర్చకుంటే కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తలలోకి ఎక్కింది.. కొందరికి సంబంధించిన వివరాలను శ్రీరెడ్డి లీక్స్ పేరిట సోషల్ మీడియాలో విడుదల చేసి సంచలనం రేపింది.
ఇక శ్రీరెడ్డి కొన్నాళ్లుగా చెన్నైలో ఉంటుంది. వైసీపీ మద్దతుదారురాలిగా ఉంటూ జగన్‌కి సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, లోకేష్‌లని ఓ రేంజ్‌లో వేసుకుంటుంది. ఆ మధ్య సీఎం జగన్‌పై దాడిని ఖండిస్తూ ఇలాంటి నీచమైన పనులకి తెగబడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ శ్రీరెడ్డి కోరింది. ఎన్నో కోట్లమందికి ప్రాణమైన వ్యక్తిపై హత్యా యత్నం చేస్తారా? అసలు మీరంతా మనుషులేనా? ఒక మనిషికి హాని తలపెట్టేంత కోపమా మీకు. ఇంతమంది జనం వస్తున్నారని జీర్ణించుకోలేక ఇలాంటి పని చేస్తారా? జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు బతుకుతున్నాయో తెలుసా? ఆయన రాష్ట్రానికి ఎంత ముఖ్యమో తెలుసా? మీ పదవుల కోసం జగనన్నకి ఇంత హాని తలపెడతారా? మేము అందరం ఆయనపైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాం. జగనన్న అంటే ప్రాణం.” అంటూ శ్రీరెడ్డి ఎమోషనల్ అయింది.
ఇక తాజాగా శ్రీరెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లని తిడుతూ ఓ వీడియో విడుదల చేసింది. ఇందులో జగన్ కుటుంబంలో చిచ్చు పెట్టావు, ముద్రగడ ఫ్యామిలీని విడదీసావు. అంబటి కూతురికి డైవర్స్ ఇచ్చేలా చేశారు అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్‌లపై విరుచుకుపడింది. ముద్రగడ కూతురికి ఏ పావలానో ఇచ్చి ఏవేవో చెప్పిస్తున్నావు అంటూ పవన్ కళ్యాణ్‌పై విమర్శల వర్షం కురిపించింది. 2014లో నువ్వు ఇచ్చిన హామీలు ఏంటి చంద్రబాబు.. ఒక్కటైన నెరవేర్చావా అంటూ మండిపడింది. అంతేకాకుండా నీకు పాపం నీ కొడుకు రూపంలోనే తగిలింది. వాడు ఏం ప్రయోజకుడు అయ్యాడు. మీరు ప్రభుత్వంలోకి వస్తే జనాలని చంపేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం శ్రీరెడ్డి వీడియో వైరల్ అయింది.
భారత క్రికెట్ జట్టు మాజీ ప్లేయర్ వినోద్ కాంబ్లి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు…
రామ్ గోపాల్ వర్మ.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈయన ఎక్కడ ఉంటే అక్కడ వివాదాలు చుట్టూ ఉంటాయి.…
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…
Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశమవుతోంది మనం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…
కూటమి ప్రభుత్వం వంద రోజుల జర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో సవాళ్లు ప్రతిసవాళ్లు ఎదురైన…
సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశంగా…
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కళ్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసి అందరిని ఆశ్చర్యపరిచారు.…
Balineni : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండడం మనం చూస్తూనే ఉన్నాం.…