SRH Vs LSG : కేఎల్ రాహుల్‌పై ల‌క్నో ఓన‌ర్ ఆగ్ర‌హం.. అంద‌రి ముందే తిట్టే స‌రికి నెటిజ‌న్ల ఆగ్ర‌హం..

SRH Vs LSG : ప్ర‌స్తుతం ఐపీఎల్ సీజ‌న్ 17 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఇక ఏయే జ‌ట్లు ప్లే ఆఫ్స్‌కి చేరుకుంటాయ‌నేది ఆస‌క్తిక‌రంగా మారింది. అయితే ముంబై ఇప్ప‌టికే అధికారికంగా ప్లే ఆఫ్స్ నుండి త‌ప్పుకుంది. ఇక మిగ‌తా జ‌ట్లు పోటీ ప‌డుతున్నాయి. అయితే బుధవారం జరిగిన మ్యాచులో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది. అయితే ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో.. పరుగులు చేసేందుకు తీవ్రంగా ఇబ్బంది పడింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 165/4 పరుగులకు పరిమితమైంది. కెప్టెన్ కేఎల్‌ రాహుల్‌ (33 బంతుల్లో 29 రన్స్‌) జిడ్డు బ్యాటింగ్ చేశాడు. ఇక సన్ రైజర్స్ ఓపెనర్లు.. లక్నో నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని 9.4 ఓవర్లలోనే ఊదేశారు. దీంతో వరుసగా రెండు మ్యాచుల్లో చిత్తుగా ఓడిన లక్నో.. ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

అయితే లక్నో నిర్దేశించిన 165 పరుగుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ 9.4 ఓవర్లలోనే ఛేదించ‌డాన్ని జీర్ణించుకోలేకపోయిన లక్నో యజమాని సంజీవ్ గోయెంకా కోపంతో ఊగిపోయారు. ఎల్ఎస్‌జీ డగౌట్ వద్ద కెప్టెన్ కేఎల్ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఈ ఓటమికి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను బాధ్యుడిని చేస్తూ గోయెంకా క్లాస్ పీకినట్లు ఈ వీడియోను చూస్తే అర్థమవుతోంది. మ్యాచ్ పరిస్థితిని కేఎల్ రాహుల్ చెప్పే ప్రయత్నం చేసినా సంజీవ్ గోయెంకా వినిపించుకోలేదు. కోపంతో ఊగిపోయారు. వారి మధ్య జరిగిన సంభాషణపై స్పష్టత లేనప్పటికీ సోషల్ మీడియాలో భిన్న‌మైన చ‌ర్చ న‌డుస్తుంది. ఇక ఆ మ్యాచ్ త‌ర్వాత కేఎల్ రాహుల్‌ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించే అవ‌కాశం కూడా ఉంద‌ని అంటున్నారు.

SRH Vs LSG kl rahul being criticised by lucknow owner sanjeev goenka
SRH Vs LSG

2016 సీజన్‌లో ధోనీ సారథ్యంలోని రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌ పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచిన స‌మ‌యంలో కూడా సంజీవ్ గోయెంకా.. ధోనిపై చిర్రుబుర్రులాడాడు. టీమ్ ఓటములకు బాధ్యుడిని చేస్తూ ధోనీని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి స్టీవ్ స్మిత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాడు. ధోనీ ఫిట్‌నెస్‌ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దాంతో ధోనీ, ఆర్‌ఎస్‌పీ మేనేజ్‌మెంట్‌కు గొడవ జరుగుతుందని ప్ర‌చారం జ‌రిగింది. ధోనీ సతీమణి సైతం తన భర్తకు మద్దతుగా సంజీవ్ గోయెంకాకు వ్యతిరేకంగా అప్పట్లో పోస్ట్‌లు పెట్టింది. అయితే ఆర్ఆర్‌పై కేకేఆర్ ఓడిన‌ప్పుడు షారూఖ్ ఎంత స్పోర్టివ్‌గా తీసుకొని వారిని మోటివేట్ చేశాడు. సంజీవ్ గోయెంకా.. కేఎల్‌కి క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

Share
Shreyan Ch

Recent Posts

జంతువుల నూనె వాడి ప‌విత్ర‌త‌ని దెబ్బ తీశారు.. భ‌క్తుల మ‌నోభావాల‌తో ఎలా చెల‌గాట‌మాడ‌తారు..?

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుడు కొలువైయున్నతిరుమ‌ల క్షేత్రంలో భక్తుల కష్టాలు తీర్చే వడ్డికాసులవాడిగా శ్రీవారు పూజలందుకుంటున్నారు. ఎన్నో వ్యయ…

2 months ago

Chandra Babu : క‌ల్తీ నెయ్యి వాడి ఏమి తెలియ‌ని నంగ‌నాచిలా మాట్లాడుతున్నారు.. చంద్ర‌బాబు ఫైర్..

Chandra Babu : తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ఎంత‌ చర్చనీయాంశమవుతోంది మ‌నం చూస్తూ ఉన్నాం. కోట్లాదిమంది హిందువుల మనోభావాలను…

2 months ago

మా మూడు పార్టీలు ఎల్ల‌ప్పుడూ ఇలా క‌లిసే ఉండాలి: సీఎం చంద్ర‌బాబు

కూట‌మి ప్ర‌భుత్వం వంద రోజుల జ‌ర్నీని పూర్తి చేసుకుంది. ఈ వంద రోజుల కాలంలో ఎన్నో స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్లు ఎదురైన…

2 months ago

త‌ప్పు చేస్తే ఒప్పుకోండి లేదంటే పోరాడండి.. జానీ మాస్ట‌ర్ ఘ‌ట‌న‌పై హీరో స్పంద‌న‌..

సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల‌లో చ‌ర్చ‌నీయాంశంగా…

2 months ago

మా మూడు పార్టీలు వేరు అయినా.. గుండె చ‌ప్పుడు ఒక‌టేన‌న్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌..

మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ క‌ళ్యాణ్ ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేసి అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచారు.…

2 months ago

Balineni : ఊహించిందే జ‌రిగింది.. వైసీపీకి బైబై చెప్పిన బాలినేని..

Balineni : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చినప్ప‌టి నుండి అనేక పరిణామాలు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.…

2 months ago

ఏపీలో మ‌ద్యం రేట్ల‌ను పెంచ‌డం వ‌ల్ల‌నే మందుబాబులు గంజాయికి అల‌వాటు ప‌డ్డారా..?

గత ప్రభుత్వం తప్పుడు విధానాలతో రాష్ట్రం నష్టపోయిందని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో మద్యం…

2 months ago

పుష్ప‌2ని దెబ్బ కొట్టిన దేవ‌ర 1.. అక్క‌డ కూడా ఎన్టీఆర్ హ‌వానే ఎక్కువ‌..

ప్ర‌స్తుతం టాలీవుడ్ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్‌గా రూపొందుతున్న విష‌యం తెలిసిందే. ఇంత‌క‌ముందు మాదిరిగా కాకుండా మ‌న సినిమాల కోసం…

2 months ago